ఆంధ్రప్రదేశ్‌

వెఎస్సార్ కాంగ్రెస్‌వి చౌకబారు విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 13: పేదలకు ప్రాణదానం చేస్తున్న ఎన్‌టిఆర్ వైద్యసేవపై వైసీపీ నేతలు, అవాకులు, చవాకులు పేలడం వారి దివాళాకోరు తనానికి, చౌకబారు విమర్శలకు తార్కాణమని టీడీపీ ఎమ్మెల్యేలు కిమిడి మృణాళిని (చీపురుపల్లి), యామినీబాల (శింగనమల) పేర్కొన్నారు. శనివారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని స్పష్టం చేశారు. అంటువ్యాధులు, విషజ్వరాలను సకాలంలో అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఎవరూ వైద్యానికి దూరం కాకూడదనే లక్ష్యంతో ఎన్‌టీఆర్ వైద్యసేవ, ఎన్‌టీఆర్ ఆరోగ్య రక్షతో పాటు సిఎంఆర్‌ఎఫ్ వంటి కార్యక్రమాలను ఫ్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. గతంలో ఆరోగ్య శ్రీ కింద 938 వ్యాధులకు చికిత్స అందించగా, నేడు 1044 వ్యాధులకు పెంచారన్నారు. వైఎస్ హయాంలో 2 లక్షల రూపాయల వరకు ఉన్న చికిత్స సహాయాన్ని నేడు రాష్ట్రప్రభుత్వం లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ 2.50 లక్షలకు పెంచిందన్నారు. 350 ఆసుపత్రుల్లో ఉన్న వైద్యాన్ని నేడు 679 ఆసుపత్రులకు విస్తరింపజేశారన్నారు. రాష్టవ్య్రాప్తంగా 1.40 కోట్ల మంది ఎన్‌టీఆర్ వైద్య సేవలను వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 5 వేల కోట్ల రూపాయల విలువైన వైద్యసేవలను ప్రజలకు అందించామన్నారు. పేదలకు ప్రాణదానంతో పాటు బడుగు, బలహీనవర్గాల ప్రజల ఆరోగ్యానికి ఎన్‌టిఆర్ వైద్యసేవ పథకం అండగా నిలబడుతుందన్నారు. అలాగే పథకంలో భాగంగా రోగులకు ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గర్భిణులను ప్రసవానంతరం ఆయా ప్రభుత్వాసుపత్రుల నుండి సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా ఇప్పటివరకు 6 లక్షల మంది సద్వినియోగం చేసుకున్నారన్నారు. మరోవైపు మాతా శిశు ఆరోగ్య పరిరక్షణలో రాష్ట్రానికి 10 పోషణ్ అభియాన్ అవార్డులు దక్కాయన్నారు. అలాగే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి 33 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వారికి రూ.2,500 పెన్షన్‌ను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. గతంలో ప్రభుత్వాసుపత్రుల్లో అడుగు పెట్టలేని పరిస్థితులు ఉండేవని, నేడు కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయని తెలిపారు.