ఆంధ్రప్రదేశ్‌

దళిత, కాపుల ఐక్యం.. ఇదే ముద్రగడ వ్యూహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 13: నాలుగేళ్లుగా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతూ వచ్చిన కాపు జేఏసీ ఇపుడు రిజర్వేషన్లతోపాటు మరో వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. కాపుల హక్కుల కోసమే జీవిస్తున్నట్టు ఇప్పటివువరకూ చెప్పుకున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇకపై దళితులతో కలిసి నడిచేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. తన వ్యూహంలో భాగంగా ప్రతీ గ్రామంలోనూ కాపుల వీధుల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పాలని కాపులకు పిలుపునిచ్చారు. దీనిని తొలుత ముద్రగడ ఆచరించి చూపారు. ముద్రగడ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కిర్లంపూడిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఇటీవల ముద్రగడ నెలకొల్పారు. అంబేద్కర్ మనుమడు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ ఇటీవల కిర్లంపూడి వచ్చి అంబేద్కర్‌ను విగ్రహాన్ని తిలకించి ముద్రగడను ప్రశంసించారు. కాగా ఈనెల 24న దళిత, కాపు ఐక్యవేదిక పేరుతో రెండు కులాలతో ఓ భారీ సమావేశాన్ని కాకినాడ నగరంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుండటం గమనార్హం! దళిత, కాపు ఐక్య వేదిక సమావేశం ఒక్క కాకినాడకే పరిమితం కాదని, 13 జిల్లాల్లోనూ నిర్వహిస్తామని కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసిరెడ్డి ఏసుదాసు స్పష్టం చేశారు. ఇదిలావుండగా బలమైన సామాజికవర్గంగా గుర్తింపు పొందిన కాపులు, దళితులు, వెనుకబడిన వర్గాల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దళిత, కాపుల ఐక్య సభ వేదిక నుండి కాపు జేఏసీ స్పష్టమైన పిలుపునివ్వనున్నట్టు తెలుస్తోంది. కాపులు, దళితులు ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని వేదిక నుండి పిలుపునివ్వనున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే దళిత నేతలు చింతా మోహన్, జీవీ హర్షకుమార్ తదితరులతో ముద్రగడ కిర్లంపూడిలో స్థాపించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. అలాగే కాకినాడలో జరుగనున్న దళిత, కాపుల ఐక్యవేదిక నుండి తమకు మద్దతునివ్వాల్సిందిగా బీసీలకు సైతం కాపు జేఏసీ పిలుపునివ్వనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో దళితులు, కాపులు, బీసీలు ఒక్కటైతే రాజ్యాధికారం ఈ వర్గాలకే అందుతుందన్న ఓ సంకేతాన్ని ఐక్యవేదిక ద్వారా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కాపులకు బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి దాని అమలుకోసం కేంద్రానికి పంపినట్టు తెలుగుదేశం ప్రభుత్వం పేర్కొంటోంది. బిల్లు అమలు బాధ్యత ఇక కేంద్రానిదే తప్ప తమ చేతుల్లో లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కాపుల రిజర్వేషన్ల సమస్య కేంద్రం పరిధిలోకి వస్తుందని, రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశం కాదని ప్రకటించి కాపుల ఆగ్రహానికి గురయ్యారు. ఈనేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఈనెల 15న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కాపుల రిజర్వేషన్లపై జనసేనాని వైఖరి ఏ విధంగా ఉంటుందోనన్న విషయమై ఆయా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.