ఆంధ్రప్రదేశ్‌

దుర్గగుడిలో భగ్గుమన్న విభేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 13: దసరా ఉత్సవాలు వేదికగా దుర్గగుడి ఈవో, పాలకమండలి సభ్యుల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. అమ్మవారి దర్శనానికి వెళ్లే దారిలో కొన్ని గేట్లకు తాళాలు వేయడంపై పాలక మండలి సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఆలయంలోని ఇతర మార్గాల కొంతమంది వెళ్తుండటంతో దానిని నియంత్రించేందుకు ఈవో కోటేశ్వరమ్మ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలోని కొన్ని గేట్లకు తాళాలు వేయించారు. కొన్ని గేట్లను తెరించేందుకు వీలు లేకుండా శనివారం తెల్లవారుఝామున వెల్డింగ్ కూడా చేయించారు. దీంతో అడ్డదారిలో దర్శనానికి వెళ్లడం కొంతమేర నిరోధించడంలో ఆమె సఫలీకృతురాలయ్యారు. అయితే కొంతమంది పాలక మండలి సభ్యులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గేట్లకు తాళాలు వేయడంతో తాము రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నామంటూ ఈవో తీరును తప్పుబపట్టారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన మంత్రి రవీంద్రకు ఈవో తీరుపై పాలక మండలి సభ్యుడు వెలగపూడి శంకరబాబు శనివారం ఫిర్యాదు చేశారు. గేట్లకు తాళాలు వేయడాన్ని తప్పుపట్టారు. ఈవో తమకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతి చోటా గేట్లకు తాళాలు వేసి భక్తులకు అసౌకర్యం కల్పిస్తున్నారంటూ మంత్రికి తాళం వేసిన గేట్లను పాలక మండలి సభ్యులు చూపించారు. తనపై మంత్రికి ఫిర్యాదు చేయడంపై ఈవో అసహనం వ్యక్తం చేశారు. పాలక మండలి సభ్యుడు ఫిర్యాదు చేయడం సబబా? అని ప్రశ్నించారు. తన ముందే ఈవో, పాలక మండలి సభ్యులు పరస్పర విమర్శలు చేసుకోవడంతో మంత్రి అవాక్కయ్యారు. పాలక మండలి సభ్యులు, ఈవోతో ప్రత్యేకంగా మంత్రి సమావేశం నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా ఉత్సవాలను నిర్వహించాలని సీఎం ఆదేశించారని, ఇటువంటి సమయంలో వివాదాలకు చోటు ఇవ్వద్దని, సంయమనం పాటించాలని సూచించారు. కాగా అమ్మవారి దర్శనానికి పాలక మండలి సభ్యులకు ప్రవేశం కల్పిస్తున్న తరహాలో పాలక మండలి కుటుంబ సభ్యులకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాలన్న వారి డిమాండ్‌ను ఈవో ససేమిరా అనడంతో కూడా పాలక మండలి సభ్యులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఉత్సవాల్లో తమకు తగిన గుర్తింపు లేకుండా పోతోందన్న అసంతృప్తి కూడా ఉంది. ఈ వ్యవహారాలన్నీ కలిసి మంత్రి వద్ద పంచాయతీకి దారితీసాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం కూడా ఈవో, పాలక మండలి మధ్య సమన్వయం కొరవడంపై కొంత అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మూల నక్షత్రం సందర్భంగా ఏర్పాట్లు తదితర అంశాలపై శనివారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయని తెలిసింది. ఈ సమావేశ వివరాలు మీడియాకు ఈవో వివరించే సమయంలో ఈవో మాట్లాడుతూ తనకు ఈగో లేదని, పాలక మండలికి తనకూ మధ్య విభేదాలు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలాంటిదంటూ తెలిపారు. పాలకమండలి చైర్మన్‌తో అన్ని విషయాలు పంచుకుంటానని తెలిపడం గమనార్హం.
అంతరాలయంపై ఈవో నిఘా
అంతరాలయంలో కొంతమంది భక్తులు ఎక్కువ సేపు ఉండటం వల్ల క్యూలైన్లలో ఉన్న భక్తులు ఇబ్బంది పడటాన్ని ఈవో కోటేశ్వరమ్మ గమనించారు. ప్రముఖులు లేనప్పటికీ, అంతరాలయంలోకి వెళ్లిన భక్తులు ఆలస్యంగా రావడంపై దృష్టి సారించారు. ప్రముఖులు కానప్పటికీ, అక్కడ ప్రత్యేక హారతి ఇస్తున్నట్లు గుర్తించి, అంతరాయంలోనే కొద్ది సేపు ఉండి వ్యవహారాలను పరిశీలించారు. ఉత్సవాల సమయంలో సహకరించాలని అక్కడ ఉన్న అర్చకులను కోరారు. అంతరాలయంలో భక్తులు కళ్లుమూసుకోవద్దని, అమ్మవారి దివ్య విగ్రహాన్ని తనివితీరా వీక్షించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.