ఆంధ్రప్రదేశ్‌

జన కవాతు ప్రత్యేక గీతం విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), అక్టోబర్ 14: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జనకవాతుకు సంబంధించిన ప్రత్యేక గీతాన్ని పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఆవిష్కరించారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాయలంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన కవాతు ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ సినీ గీత రచయిత రామజోగయ్యశాస్ర్తీ రచించిన ఈ గేయానికి సినీ సంగీత దర్శకుడు తమన్ స్వరకల్పన చేశారు. పదా.. పదపదపద.. అనే చరణంతో సాగే ఈ పాట మధ్యమధ్యలో పవన్ కొన్ని కవితలు చెప్పేలా రూపొందిచారు. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ రాసిన రాహువు పట్టిన పట్టు వంటి కవితలను ఈ గేయంలో ప్రజలను ఉత్తేజితుల్ని చేసేలా, గమ్యాన్ని నిర్దేశించేలా వినియోగించారు. గీత రచయిత రామజోగయ్య శాస్ర్తీ, స్వరపరిచిన తమన్‌కు పవన్‌కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కవాతు ఏర్పాట్లపై సమీక్ష
ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన పార్టీ ఈ నెల 15న నిర్వహించే కవాతుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ సమీక్షించారు. సుమారు 2లక్షల మంది హాజరయ్యే అవకాశమున్న కవాతు సందర్భంగా తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు. కవాతుకు హాజరయ్యే ప్రతి జనసైనికుడు తిరిగి క్షేమంగా ఇంటికి చేరాలా తీసుకోవాల్సి జాగ్రత్తలను నాయకులు తెలిపారు. రక్షణ చర్యల గురించి పవన్ అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కవాతులో పాల్గొనే ప్రతీఒక్కరు క్షేమంగా తిరిగి ఇళ్లకు చేరుకోవాలన్నారు. క్రమశిక్షణతో అందరూ పాల్గొని కవాతులో తనతోపాటు ముందుకు సాగాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మీ క్షేమమే నా ప్రథమ బాధ్యత అన్న ఆయన బైకుల్లో స్పీడ్‌గా వెళ్లేటప్పుడు మీ తల్లిదండ్రులను, తనను గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలకు జనసైనికులు రక్షణకవచంలా నిలవాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా నాయకులు జనకవాతు కోసం రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే వాహనాలకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలను రూట్‌మ్యాప్ ద్వారా తెలిపారు. ఈ నెల 15న తూర్పు గోదావరి జిల్లా పిచ్చుక లంకలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైయ్యే ఈ జన కవాతు 2.5 కిలో మీటర్చల పొడవు ఉండే కాటన్ బ్యారేజిపై కొనసాగి ధవళేశ్వరం చేరేందుకు గంటన్నర సమయం పడుతుందని పార్టీ నేతలు పవన్‌కు వివరించారు.

చిత్రం..విజయవాడ పార్టీ కార్యాలయంలో జన కవాతు ప్రత్యేక గీతం విడుదల చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్