ఆంధ్రప్రదేశ్‌

విపత్తుల కంటే రాజకీయ కుట్రలే సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: రాష్ట్రం ఏర్పడగానే విభజన సమస్యలు చుట్టుముట్టాయని, విభజన సమయంలో కేంద్రంలోని పార్టీ ఒకరకంగా ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మరో రకంగా ఇబ్బంది పెడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఒకవైపు విభజన కష్టాలు, మరోవైపు ప్రకృతి విపత్తులు చుట్టుముట్టాయని, అయినా పట్టుదలతో, కసిగా పని చేసి అధిగమిస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొంటున్నాం కానీ రాజకీయ కుట్రలు అంతకంటే తలనొప్పిగా మారాయని అసహనం వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో నీరు- ప్రగతి, వ్యవసాయంపై సోమవారం ఆయన అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆ రోజు ఒక జాతీయ పార్టీ అన్యాయం చేస్తే, ఈ రోజు మరో పార్టీ సహాయ నిరాకరణతో అన్యాయం చేస్తోందని ఆరోపించారు. మన హక్కులు డిమాండ్ చేస్తే, దాడులు చేసే పరిస్థితి ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదన్నారు. ఐటి దాడులు చేయడం ద్వారా బెదిరిస్తున్నారని ఆరోపించారు. తిత్లీ తుపానులో ప్రాణనష్టం తగ్గించగలిగామన్నారు. శ్రీకాకుళంలో సాధారణ పరిస్థితి వచ్చేదాకా విశ్రమించవద్దని, బాధిత ప్రజలకు అండగా ఉండాలని అధికారులకు పిలుపునిచ్చారు. వంశధార ఎడమ కాలువ గండ్లు తక్షణం పూడ్చాలని, రైతులకు బీమా కల్పించాలన్నారు. మంగళవారం తాను వచ్చే నాటికి పరిస్థితులు పూర్తిగా మెరుగుపడాలని స్పష్టం చేశారు.