ఆంధ్రప్రదేశ్‌

‘సదావర్తి’లో జోక్యం చేసుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: గుంటూరు జిల్లాలోని సదావర్తి భూముల అమ్మకం వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. అమరావతిలోని శ్రీసదావర్తిసత్రం భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిడంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు అవసరమైన కారణాలు కనిపించడం లేదని హైకోర్టు మంగళవారం నాడు వ్యాఖ్యానించింది. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల అమ్మకాన్ని సోమవారం నాడు హైకోర్టులో సమర్థించుకుంది. సదావర్తి భూముల అమ్మకాన్ని సవాలు చేస్తూ అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య దాఖలు చేసిన పిటీషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌రావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. సదావర్తి భూముల అమ్మకంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అమ్మకాలను వీడియో రికార్డు చేశామని, అత్యధికంగా చెల్లించిన బిడ్డర్లకు భూమిని అమ్మినట్టు ఎపి అడ్వకేట్ జనరల్ దొమ్మలపాటి శ్రీనివాస్ వాదించారు. తక్కువ ధరకు భూములను కట్టబెట్టారన్న పిటీషనర్ వాదనను అడ్వకేట్ జనరల్ తోసిపుచ్చారు. తమిళనాడులోని తాలంబూరు, నవులూరు, పోడూరు గ్రామాల్లోని భూముల ధర ఎకరా ఐదు కోట్లు ఉంటుందని పిటీషనర్ పేర్కొనడాన్ని తీవ్రంగా దుయ్యబట్టిన ఎజి అంత మేరకు చెల్లిస్తే ఆ భూములను ఆయనకే అందజేస్తామని పేర్కొన్నారు.

నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వేలైన్ పూర్తి
నేడు గూడ్స్ రైలు పరుగులు
నంద్యాల, జూలై 12: కర్నూలు జిల్లా నంద్యాల, కడప జిల్లా ఎర్రగుంట్ల మధ్య రైల్వేలైన్ నిర్మాణం పూర్తయింది. నంద్యాల రైల్వేస్టేషన్ శివారులో ఏర్పాటు చేసిన క్యాబిన్ వద్ద ఎర్రగుంట్ల రైల్వేలైన్‌కు గుంటూరు - గుంతకల్లు ప్రధాన రైల్వేలైన్‌కు లింకు పూర్తయింది. దీంతో బుధవారం ఈ మార్గంలో గూడ్స్ రైలు తిప్పనున్నారు. 123 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రైల్వేలైన్ నిర్మాణానికి సుమారు 20 ఏళ్లు పట్టింది. రెండు దశల్లో రైల్వేలైన్ నిర్మాణం చేపట్టారు. తొలిదశలో ఎర్రగుంట్ల-నొస్సం మధ్య చేపట్టిన 48 కిలోమీటర్ల లైన్ 2009 నాటికి పూర్తయింది. మలిదశలో నొస్సం-బనగానపల్లె మధ్య 45 కిలోమీటర్ల లైన్ 2012 నాటికి పూర్తయింది. బనగానపల్లె-నంద్యాల మధ్య 30 కిలోమీటర్ల దూరం మంగళవారంతో పూర్తయింది. ఇందుకు రూ.950 కోట్లు ఖర్చయింది. గూడ్స్ రైలు పరీక్ష పూర్తయితే అక్టోబర్‌లో ప్రయాణికుల రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిచే అవకాశాలు ఉన్నాయని రైల్వే ఉన్నతాధికారులు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే కొత్త రైల్వేమార్గంతో 169 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.

నేడు టి.ఎమ్సెట్ -2 ఫలితాలు

హైదరాబాద్, జూలై 12: తెలంగాణ ప్రభుత్వం ఈనెల 9న నిర్వహించిన ఎమ్సెట్-2 ఫలితాలను వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి బుధవారం సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో విడుదల చేయనున్నారు. ఎమ్సెట్-2కు 56,188 మంది దరఖాస్తు చేయగా, ఆంధ్రా, తెలంగాణ కలిపి 95 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం పరీక్ష తొలి కీ విడుదల చేశారు. దానిపై విద్యార్ధుల నుండి 12వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరించారు. పెద్దగా అభ్యంతరాలు రాకపోవడంతో 13వ తేదీనే ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి పాపిరెడ్డి, జెఎన్‌టియు విసి శైలజా రామయ్యార్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఎం రమణి , హెల్త్ యూనివర్శిటీ విసి డాక్టర్ బి కరుణాకర్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ వి రమణారావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్ యాదయ్య, కో కన్వీనర్ ప్రొఫెసర్ జి కె విశ్వనాధ్, సిఆర్‌సి డాక్టర్ ఎ గోవర్ధన్ పాల్గొంటారు.