ఆంధ్రప్రదేశ్‌

టీటీడీ పట్టువస్త్రాల సమర్పణలో వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పట్టువస్త్రాల సమర్పణ వివాదాస్పదంగా మారింది. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణలో తనను పట్టించుకోలేదంటూ టీటీడీ బోర్డు సభ్యుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అలిగి వెళ్లడం విమర్శలకు గురైంది. కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు ఏఈవో సాయిలును టీటీడీ అధికారికంగా పంపింది. దీంతో ఆయనకు దుర్గగుడి అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి అమ్మవారికి వస్త్రాలను సమర్పించారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన తనను పట్టించుకోలేదంటూ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర రావు అలిగి మధ్యలోనే వెళ్లిపోయారు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న తనను పక్కనపెట్టి ఏఈవోకు స్వాగతం పలకడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వస్త్రాల సమర్పణ అనంతరం ఆశీర్వాద సమయంలో ఆయన అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. ఈవో సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆయన వెళ్లిపోయారు. దీంతో ఈవో కోటేశ్వరమ్మ తీరుపై ఎమ్మెల్యే అనుయాయలు హడావుడి చేశారు. దీనిపై ఈవో స్పందిస్తూ, తనకు టీటీడీ జేఈవో నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఏఈవోను పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారని స్పష్టం చేశారు. అక్కడ ఉన్న టీటీడీ పాలక మండలి సభ్యునికి సమచారం ఇవ్వాలని మాత్రమే తెలిపారన్నారు. ఆ మేరకు సమచారం ఇచ్చామని, ఆయన్ని అవమానించలేదన్నారు. జేఈవో ఆదేశాల మేరకు ఏఈవో ద్వారానే పట్టువస్త్రాల సమర్పణ చేయించామన్నారు. ఎమ్మెల్యే పట్టువస్త్రాలు తీసుకువస్తారని ఎవరూ చెప్పలేదన్నారు. ఏఈవో సాయిలు మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకే వస్త్రాలు సమర్పించానని తెలిపారు. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణకు టీటీడీ అధికారులతో మాట్లాడకుండా దుర్గగుడి అధికారులను ఎమ్మెల్యే తప్పుపట్టడం విమర్శలకు గురైంది.