ఆంధ్రప్రదేశ్‌

మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: రాష్ట్ర ప్రభుత్వంతో మున్సిపల్ కార్మికుల సమ్మె డిమాండ్లపై మంగళవారం జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. 13 రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె విరమించారు. బుధవారం నుంచ విధులకు హాజరుకానున్నారు. కార్మికుల ప్రధాన డిమాండ్ 279 జీవోపై యథాతథ స్థితిని కొనసాగించేందుకు, అధికారులు, మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు అంగీకారం కుదిరింది. మంగళవారం విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిధిలోని టిడ్‌కో ఆఫీసులో మున్సిపల్ జేఏసీ నాయకులతో మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ కరికాల ఎన్‌డీఎంఏకే కన్నబాబు చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల సారాంశాన్ని సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ ఉమామహేశ్వరరావు, ఏఐటీయుసి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని వెంకట రామారావు, జేఏసీ నాయకులతో కలిసి మంగళవారం రాత్రి విలేఖర్ల సమావేశంలో వివరించారు.