ఆంధ్రప్రదేశ్‌

విపత్తులపై ముందే హెచ్చరించా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 22: విభజన సమయంలోనే ఏపీలో విపత్తుల గురించి హెచ్చరించామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. నీరు-ప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్‌చంద్ర పునేఠా సోమవారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాన్లు, వర్షాభావం, కరవు పరిస్థితులు ఉత్పన్నమవుతాయని విభజన సందర్భంగా గుర్తుచేసినట్లు చెప్పారు. నాలుగేళ్లలో హుదూద్, తిత్లీ తుపాన్లు సంభవించాయి.. మరో రెండేళ్లు కరవు పరిస్థితులు ఎదుర్కొన్నాం.. భౌగోళిక ప్రత్యేకత దృష్ట్యా ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా చూడాలని కోరా.. కానీ కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోందని అసహనం వ్యక్తంచేశారు. పట్టుదలతో, మనకున్న వనరులతోనే పనులు చేస్తున్నాం.. విపత్తులను అధిగమిస్తున్నాం.. మిషన్ అంత్యోదయలో అవార్డులు ఏపీకే దక్కాయి.. దేశంలో 224 గ్రామాలు ముందుంటే అందులో 132 ఏపీవే అన్నారు. ఆదర్శ గ్రామాల్లో 55 శాతం రాష్ట్రానికే చెందినవన్నారు. దీన్ని 70 నుంచి 80 శాతానికి తీసుకువెళ్లాలని అధికారులకు నిర్దేశించారు.
నరేగా కింద ఇప్పటి వరకు 17.4 కోట్ల పనిదినాలు పూర్తిచేశామన్నారు. పనిదినాల సంఖ్య 22 కోట్లకు సడలించామని పట్టుదలగా కృషిచేస్తే 25 కోట్లకు చేరుకోవచ్చన్నారు. వేతనాల ఖర్చు రూ 5వేల 500 కోట్లు, మెటీరియల్ ఎక్స్‌పెండిచర్ రూ 3 వేల కోట్లు వస్తాయన్నారు. ఈ ఏడాది నరేగా నిధులు రూ 10వేల కోట్లు వినియోగించుకోవాల్సి ఉందన్నారు. 295 కరవు మండలాల్లో 50 అదనపు పనిదినాలు కల్పించామన్నారు. ఘనవ్యర్థాల నియంత్రణ షెడ్స్ నాలుగువేలు పూర్తయ్యాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటా వివరించారు. మరో నాలుగువేల షెడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందన్నారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను ముమ్మరం చేయాలని సూచించారు. స్వైన్‌ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలని పొరుగు రాష్ట్రాల ప్రయాణికుల రద్దీ కారణంగా జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలన్నారు.
ఖరీఫ్‌లో 36లక్షల హెక్టార్లలో సేద్యం జరిగిందని, రబీలో కూడా 26 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యం చేరుకోవాలన్నారు. రబీలో పంట రుణాల లక్ష్యం రూ 42వేల 530 కోట్లకు చేరాలని, కౌలురైతులకు పంట రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వాలన్నారు. ఖరీఫ్‌లో కత్తెర పురుగును నియంత్రించ గలిగామన్నారు. రబీలో కూడా నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతపురం, పశ్చిమగోదావరి, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.