ఆంధ్రప్రదేశ్‌

కొలిక్కి వచ్చిన కొత్త మండలాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 23: రాష్ట్రంలో కొత్తగా 9 అర్బన్ మండలాల ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఇందుకు అవసరమైన సిబ్బంది కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడంతో కొత్త మండలాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాష్ట్రంలో కొన్ని పట్టణాల్లో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కాంగ్రెస్ హయంలో కూడా ఈ డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈ డిమాండ్ అమలుకు నిర్ణయించింది. కొత్తగా 17 మండలాలు ఏర్పాటుకు ప్రతిపాదించినప్పటికీ, 9 మండలాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గం ఆమోదం లభించినప్పటికీ, 6 నెలలుగా ఈ దిశగా పురోగతి లేదు. ఆర్థిక శాఖ ఆమోదించడంతో కొత్త మండలాలకు సిబ్బందిని మంజూరు చేసింది. విజయవాడ, విశాఖల్లో 3 చొప్పున, కర్నూల్, నెల్లూరు, గంటూరుల్లో ఒక్కొక్కటి చొప్పున మంజూరు చేసింది. ఇందుకు అవసరమైన 90 మంది సిబ్బంది శాశ్వత ప్రాతిపదికన నియమించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
తహశీల్దారు, ఉప తహశీల్దారు, సర్వేయరు, వాచ్‌మెన్ సహా 10 మంది సిబ్బంది ఒక్కో మండల కార్యలయంలో ఉంటారు.