ఆంధ్రప్రదేశ్‌

వాల్మీకి బోధనలు ప్రచారం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 23: పతనమైపోతున్న నైతిక విలువల పునరుద్ధరణకు వాల్మీకి బోధనల ప్రచారం ఎంతో అవసరమని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహనిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంలో విలువల పునరుద్ధరణకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. బుధవారం వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన రచనలను, ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తున్న వారందరికీ వాల్మీకి జయంతి శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మాన్ని పోతపోస్తే రాముడి రూపం అవుతుందని, ధర్మం కోసం, ధర్మనిష్టలో జరిగే సంఘర్షణలో మంచివైపు నిలబడటం కోసం, ఆడినమాట తప్పకుండా ఉండటం కోసం, స్నేహం విలువ తెలుసుకోవడం కోసం, అన్నదమ్ముల అనురాగాల సౌధాల కోసం, ఒక్కమాటలో చెప్పాలంటే రామరాజ్యం కోసం రామాయణాన్ని చదవాలన్నారు. వాల్మీకి మహర్షి హృదయాన్ని అర్థం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకి, బోయల దశాబ్దాల ఎస్టీ సాధన డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన ముఖ్యమంత్రికి వాల్మీకి సామాజికవర్గం ఆజన్మాంతం రుణపడి వుంటుందని మంత్రి అన్నారు.