ఆంధ్రప్రదేశ్‌

పోలవరం ప్రాంతంలో ప్రత్యామ్నాయ రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, నవంబర్ 5: పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లే రహదారి పైకి ఉబికి, బీటలు తీసిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని అధికారులు సిద్ధంచేశారు. సోమవారం ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం పూర్తవ్వడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. గత శనివారం ప్రాజెక్టుకు వెళ్లే రోడ్డు ఆరు మీటర్ల ఎత్తుకు పెరగడంతోపాటు బీటలు తీయడంతో 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన విషయం విదితమే. దాంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా మరో రోడ్డును పోలవరం కాంట్రాక్టు సంస్థలు త్రివేణి, నవయుగ సంస్థల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు. దీనితో సోమవారం నుండి రాకపోకలు ప్రారంభమయ్యాయి. అలాగే 33 కెవి, 11 కెవి విద్యుత్ స్తంభాలు పునరుద్ధరించడంతో గిరిజన గ్రామాలకు, ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి విద్యుత్ సరఫరా తిరిగి ప్రారంభమైంది. స్పిల్‌వే ఛానల్లో నిలిపివేసిన మట్టి తీసే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి.

చిత్రం..ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో కొత్తగా నిర్మించిన రోడ్డు (ఎడమవైపు), కుడివైపున ధ్వంసమైన రహదారి