ఆంధ్రప్రదేశ్‌

జడ్పీ సమావేశంలో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,నవంబర్ 5: ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ ఈదర హరిబాబు అధ్యక్షతన సోమవారం ఒంగోలులో జరిగింది. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్, సిఇఓ మధ్య పలుసార్లు వాగ్వివాదం జరగడంతో గందగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక సందర్భంలో ఎవరేమి మాట్లాడుతున్నారో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, జిల్లా పరిషత్ సిఇఒ కైలాష్ గిరీశ్వర్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. జడ్‌పి తీర్మానాలను ఆమోదించాలని, ఆపే అధికారం జిల్లా పరిషత్ సిఇఒకు లేదని జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, పాలక,ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాపరిషత్ తీర్మానాలపై ప్రెస్‌మీట్ పెట్టి మీడియాకు వివరించే అధికారం సిఇఒకి ఎక్కడదని సభ్యులు ప్రశ్నించారు. ప్రధానంగా జిల్లాపరిషత్‌లో 23కోట్లరూపాయలు నిధులు ఉన్నాయని జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు చెబుతుండగా కాదు కోటి 63లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని సిఇఒ చెప్పగా సభలో సిఇఒతో చైర్మన్‌తోపాటు పాలక, ప్రతిపక్షసభ్యులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలమేరకే నడుచుకుంటానని సిఇఓ చెప్పడంతో జడ్పీటిసీలు అజెండా కాపీలు ఆయనపైకి విసిరి నిరసన తెలిపారు.
ప్రజాప్రతినిధుల విధుల్లో అధికారుల జోక్యం సహించబోమని జడ్పీ చైర్మన్ ఈదర అన్నారు. ఈ సందర్భంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ జడ్పీ వ్యవహారాలు బజారున పడేయడం భావ్యంకాదన్నారు. ఈ సందర్భంగా జడ్పీ సిఇఓ మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీలు లేకపోవటంతో ప్రతిపాదనల్లో సమతూల్యత లేదని అందుకే ఆమోదించలేదన్నారు. కాగా , ప్రతిపాదలను వెల్లడిస్తే అందరికి తెలుస్తామని దీంతో ఆమోదం పొందవచ్చునని పేర్కొన్నారు. ప్రధానంగా జిల్లాపరిషత్ చైర్మన్‌కు, జిల్లా పరిషత్ సిఇఒకు సఖ్యతలేకపోవటంతోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని, అందువలన మీరిద్దరు సఖ్యతో ఉండి జిల్లాను అభివృద్ధి పర్చాలని సభ్యులు ముక్తకంఠంతో కోరారు. ఈ సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.