ఆంధ్రప్రదేశ్‌

గనులు తవ్వి ఎలుకను పట్టారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), నవంబర్ 6: గనులు తవ్వి ఎలుకను పట్టినట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లాలో బాక్సైట్‌ను తవ్వేశారని, ఈ లీజులపై సమగ్ర విచారణ జరిపించాలని పవన్‌కళ్యాణ్ సోషల్ మీడియాలో డిమాండ్ చేసిన నేపథ్యంలో దీనిపై మంత్రి లోకేష్ మంగళవారం ట్టిట్టర్ వేదికగా స్పందించారు. వంతాడ గ్రామంలో ఒక జర్నలిస్టులా పవన్ కళ్యాణ్ ఫేస్ బుక్‌లో లైవ్‌లో లాటరైటు గనుల స్థితిగతులను వివరించారని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వంతాడ గనిలో 100 లారీలు తిరిగేవని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత 200 లారీలు తిరుగుతున్నట్లు పవన్ ఆరోపించారన్నారు. అసలు విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ అక్కడ తిరుగుతున్నప్పుడు ఒక్క లారీ కూడా కనబడలేదన్నారు. అదేమంటే తాను వస్తున్నానని తెలిసి మైనింగ్ ఆపేసి, విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు పవన్‌కళ్యాణ్ ఆరోపించారన్నారు. ఆ విషయం అలా ఉంచితే ముఖ్యమంత్రిని, తనను ప్రస్తావిస్తూ ఇవిగో ఆధారాలు అంటూ వంతాడ గనుల లీజులోని అక్రమాల మీద తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తయారు చేసిన 18 పేజీల నివేదికను సోమవారం సోషల్ మీడియాలో పవన్ జత చేసినట్లు తెలిపారు. అసలు ఈ గనులను లీజును 2004, 2005, 2007లో ఇచ్చినట్లు స్పష్టంగా ఉందన్నారు. వీటితో పాటు పవన్‌కళ్యాణ్ జత చేసిన మరో రిపోర్టులో 2010లో మరో లీజు ఇచ్చినట్లుగా ఉందన్నారు.
ఆ సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం లేదు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు లేరు.. మంత్రిగా తాను కూడా లేని సందర్భంలో మేము ఎలా బాధ్యులమవుతామో పవన్‌కళ్యాణ్‌కే తెలియాలన్నారు. వంతాడ గనుల గురించి 2010 వరకే తెలుసుకుని ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు తెలియని ఇంకో విషయం ఇందులో ఉందన్నారు. సెప్టెంబర్ 2012 లోనే నాటి పరిశ్రమలు, వాణిజ్య (విజిలెన్స్) శాఖ అక్రమాలకు పాల్పడిన అధికారులపై కామన్ ప్రొసిడింగ్స్‌కు ఆదేశిస్తూ జీవో ఆర్ టి 631ని జారీ చేసిందని గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత వీటన్నిటినీ ఆధారం చేసుకుని లీజును రద్దు చేసిందన్నారు. పరిశ్రమలు, వాణిజ్య (విజిలెన్స్) శాఖ 2015 డిసెంబర్‌లో జారీ చేసిన జీవో నెంబర్ 121ని చూస్తే ఇదే విషయం తెలుస్తుందని చెబుతూ జీవో వివరాలను లోకేష్ ట్టిట్టర్‌లో జత చేశారు. ఒక పార్టీకి బాధ్యత గల ప్రతినిధిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించడం తగదన్నారు. గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు చేసిన పవన్‌కళ్యాణ్ తీరా ఆధారాలు అడిగే సమయానికి ఎవరో చెబితే విన్నాను...అదే నేను మాట్లాడాను అని బదులిచ్చినట్లు లోకేష్ గుర్తు చేశారు. నాయకుడిగా ఉన్న పవన్‌కళ్యాణ్ ఇంత బాధ్యతారాహిత్యంగా ఉండటం ప్రజలకు మంచి చేయదన్నారు. చేతికి దొరికిన బురదను చల్లేద్దాం అనుకోవడం మంచి పద్ధతి కాదన్నారు.
అధికార పార్టీ కాబట్టి వాళ్ళే కడుక్కుంటారని అనుకోవద్దన్నారు. అధికార పార్టీ ఉన్నది ప్రజల కోసం పని చేయడానికన్నారు. పనిగట్టుకుని ఎవరో చేసే ఆరోపణలకు సంజాయిషీలు ఇచ్చుకోవడానికి కాదన్నారు. మీరు గానీ మేముగాని ప్రజలకు జవాబుదారీ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. విమర్శలు, ఆరోపణలు సహేతుకంగా ఉండాలన్నారు. విషయంపై పూర్తి అవగాహన తెచ్చుకుని, పూర్తి వివరాలు తెలుసుకున్న తరవాతనే స్పందించాలని పవన్‌కు లోకేష్ సలహా ఇచ్చారు. అంతే గాని ఎవరో చెబితే విని, ఢిల్లీ నుంచి ఎవరో ఏదో చేయమంటే చేయడం సరికాదన్నారు. అభివృద్దికి, ప్రజా సంక్షేమానికి మీరు అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నారని లోకేష్ ఆరోపించారు.