ఆంధ్రప్రదేశ్‌

చివరి దశలో అభ్యర్థుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపిక చివరి దశకు చేరిందని, ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి తెలిపారు. తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, తదితరులతో కలిసి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో గురువారం రావుల సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించారు.
అనంతరం ఉండవల్లిలో ప్రజావేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో జరిగే రాజకీయ పరిణామాలపై చంద్రబాబు నాయుడికి స్పష్టమైన అవగాహన ఉందని, ఆయన ఆదేశాల మేరకే ఎన్నికల్లో పని చేస్తామని తెలిపారు. సీట్లు, పదవుల కోసం పాకులాడే నేతలంతా ఇప్పటికే పార్టీని వదలి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు నిఖార్సైన నాయకులే పార్టీలో ఉన్నారని స్పష్టం చేశారు. మహాకూటమి అనేది నాలుగు పార్టీల కలయిక కావడంతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం అవుతోందన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళతామని, తమ కూటమి తప్పక విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకపాత్ర పోషించనున్నారని, బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేసేందుకు చేస్తున్న కృషిని అందరూ గమనిస్తున్నారన్నారు.
చంద్రబాబును కలిసిన
కేసీఆర్ అన్న కుమార్తె
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్న కుమార్తె కే రమ్యారావు గురువారం కలవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆమె చంద్రబాబును కలిసి, టీడీపీలో చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేయడం గమనార్హం. కేసీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే ఆమె, 2015లో కాంగ్రెస్‌లో అప్పటి పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య హయాంలో చేరారు. కాంగ్రెస్‌లో నేటికీ కొనసాగుతున్నప్పటికీ, ఆమె క్రియాశీలకంగా లేరు. తెలంగాణ ఎన్నికల్లో ఆమెకు టికెట్ కేటాయించాలని కోరగా, కాంగ్రెస్ అధిష్ఠానం తిరస్కరించడంతో టీడీపీలో తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ఆమె విజయవాడ వచ్చారు. ముఖ్యమంత్రితో భేటీలో తనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా టికెట్ కేటాయించాలని కోరినట్లు సమాచారం. పార్టీలో చేర్చుకునే అంశంపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని టీటీడీపీ నేతలకు కూడా చెప్పినట్లు తెలిసింది.
గెలిచే స్థానాలే తీసుకుంటాం
తెలంగాణ ఎన్నికల్లో గెలిచే స్థానాలను మాత్రమే తీసుకోవాలని నిర్ణయించినట్లు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వెల్లడించారు. ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన గురువారం కలిశారు. అనంతరం ప్రజావేదిక వద్ద ఆయన మీడియాతో గురువారం మాట్లాడుతూ తెలంగాణలో పరిస్థితులు చంద్రబాబుకు వివరించామన్నారు. మహాకూటమి సంప్రదింపులపైనా నివేదికను అందచేశామన్నారు. తెలంగాణ టీడీపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఎప్పటికప్పుడు చంద్రబాబుకు తెలియచేస్తున్నామన్నారు. శనివారంలోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి అవుతుందన్నారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ తరపున రెండంకెల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటారన్నారు. తెలంగాణలో మహాకూటమి విజయం తథ్యమన్నారు. మంచి స్ఫూర్తితో మహా కూటమి ముందుకు వెళ్తోందన్నారు.
చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసిన కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు