ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర హోం శాఖ మెచ్చుకుంటే మాజీ డీజీపీ నిందలేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ నేత, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి ఆరోపించటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. దినేష్‌రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా, ఎవరిపై అభిమానం చూపినా మాకు అభ్యంతరం లేదని, బాధ్యతాయుతమైన వృత్తిలో కొనసాగిన విషయం మరిచి, ఆధారాలు లేకుండా అనాలోచితంగా మాట్లాడటం మంచిది కాదని వర్ల హితవు పలికారు.
విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖర్ల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ గతంలో డీజీపీగా పని చేసిన వ్యక్తి నోటికి ఏది తోస్తే అది మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఏపీలో ఏ ప్రాంతంలో, ఎవరి విషయంలో శాంతిభద్రతలు సక్రమంగా లేవో ఆధారాలతో సహా దినేష్‌రెడ్డి స్పష్టం చేస్తే తమ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ పనితీరుని కేంద్ర హోం శాఖ మెచ్చుకుంటే మాజీ పోలీసు అధికారి నిందలేస్తూ నొచ్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో, క్రైం, క్రిమినల్ ఇనె్వస్టిగేషన్ సిస్టమ్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అద్భుతంగా పని చేస్తోందని మూడు రోజుల క్రితమే కేంద్ర హోంశాఖ మెచ్చుకుందని, స్వయంగా కేంద్ర హోం శాఖే ప్రశంశలు కురిపించిన విషయాన్ని దినేష్‌రెడ్డి గుర్తించకపోవడం విచారకరమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారైన సంగతి దినేష్‌రెడ్డి తెలుసుకుంటే మంచిదన్నారు. కేంద్రంలో మోదీ అధికారం చేపట్టాక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని, ప్రతి రోజు ఆరుగురు దళిత మహిళలపై, ప్రతి 15 నిమిషాలకు దళితులపై దాడులు జరుగుతున్నాయని, 66 శాతం వరకు దాడులు పెరిగాయని నివేదికలే స్పష్టం చేశాయన్నారు.
ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి కోడికత్తి డ్రామాలో వ్యవహరించిన తీరుని సాక్షాత్తు హైకోర్టే తప్పుపట్టిందని, విచారణకు సహకరించకుండా పోలీసులను ఎలా నిందిస్తారని మొట్టికాయలు వేసిందని రామయ్య పేర్కొన్నారు. విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్సీ, టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు పాల్గొన్నారు.