ఆంధ్రప్రదేశ్‌

తిత్లీ తుపాను బాధితులకు ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 10: తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ఫుడ్‌ప్రాసెసింగ్ అసోసియేషన్, పార్లీ బిస్కెట్ సంస్థలు ముందుకొచ్చాయి. బాధితులకు రూ 5.7 లక్షల విలువగల పోషక విలువలతో కూడిన రెండు ట్రక్కుల పార్లీ జీ బిస్కెట్లు పంపుతామని సంస్థ ప్రతినిధులు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరించారు. కాగా రాష్టవ్య్రాప్తంగా వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు 60 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ విరాళాన్ని చెక్కురూపంలో ముఖ్యమంత్రికి అందజేశారు. మెగా ఫుడ్‌పార్క్, ఎస్‌హెచ్ ఫుడ్ ప్రాసెసింగ్, నార్త్‌కోస్టల్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, స్పెషలైజ్డ్ ఎస్‌ఆర్‌కే ఫుడ్స్, శ్రీచందన ఫుడ్ పార్క్, గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్ సంస్థల యాజమాన్యాలు రూ 10లక్షల చొప్పున సేకరించిన 60లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. మానవతా దృక్పథంతో బాధితులకు విరాళాలు అందిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు.

చిత్రం..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి 60 లక్షల రూపాయల చెక్కు అందజేస్తున్న
ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల ప్రతినిధులు