ఆంధ్రప్రదేశ్‌

కోడికత్తిని ఎందుకు దాచారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 10: విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిలో కోడికత్తిని ఎందుకు దాచి ఉంచారో ప్రజలకు వివరించాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖల మంత్రి కాలువ శ్రీనివాసులు డిమాం డ్ చేశారు. శనివారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్‌పై దాడికి సంబంధించి పలు అనుమానాలు నివృత్తి కావాల్సి ఉందన్నారు. కత్తికి విషం పూస్తే హైదరాబాద్ వరకు ఎలా ప్రయాణం చేశారో తేల్చాలన్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన తరువాత గాయం పెద్దది చేశారని, పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకపోవటంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నంలో భాగంగానే ఈ ఘటన జరిగిందన్నారు. నిష్పక్షపాతంగా పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను అనుమానించటం వారిని అవమానించటమే అన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థమీద, అధికారులపై నమ్మకంలేకుండా రాష్ట్రంలో ఎలా పర్యటిస్తారని నిలదీశారు. పోలీసుల చిత్తశుద్దిని అనుమానించే వ్యక్తి ఎవరి రక్షణలో ఉంటారో వివరించాలన్నారు. విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగితే విశాఖలో చికిత్స చేయించుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా హైదరాబాద్ ఎందుకు వెళ్లారు.. ఎవరు పంపారు? దాడి జరిగిన తరువాత కోడి కత్తిని ఎందుకు మాయం చేశారు.. రక్తం కారిన జగన్ చొక్కాను ఏంచేశారు? గాయపడిన వ్యక్తి విమానంలో ఎలా పయనించారు? ఎవరు అనుమతించారనే విషయాలపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయని వీటికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.