ఆంధ్రప్రదేశ్‌

రాష్టవ్య్రాప్తంగా అన్ని కలెక్టరేట్లలో జీసీసీ స్టాల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 10: రాష్టవ్య్రాప్తంగా అన్ని కలెక్టరేట్లలో జీసీసీ స్టాళ్లను ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది. పలు రకాల అటవీ ఉత్పత్తులను ఈ స్టాళ్ళ ద్వారా వినియోగదారులకు చేరాలని, తద్వారా ఆర్థిక లక్ష్యాలను సాధించాలనేది సంస్థ లక్ష్యం. ఏపీలో తొలుత ఒకటి, రెండు జిల్లాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. అప్పుడు లభించే ఆదరణనుబట్టి క్రమేపీ మిగిలిన జిల్లాలకు విస్తరించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఇందులోభాగంగా తొలుత విశాఖ కలెక్టరేట్‌లో జీసీసీ స్టాల్ ఏర్పాటు కానుంది. ఇందులో అటవీ ఉత్పతులన్నీ లభించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన అరకు కాఫీకి ఈ స్టాల్‌లో ప్రాధాన్యం కల్పిస్తారు. వేసవి తాపాన్ని తీర్చి, ఆరోగ్యాన్ని అందించే నన్నారి, బిల్వ షర్బత్‌లను, తేనె, చింతపండు, సబ్బులు, డిటర్జెంట్ సోప్స్, కాఫీ పౌడర్, కారం పొడి, త్రిఫల చూర్ణం తదితర వాటిని కూడా ఈ స్టాళ్ళ ద్వారా విక్రయిస్తారు. ఇటీవల కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన పచ్చి జీడిపప్పు, వేపిన పప్పు సామాన్యులకు అందుబాటు ధరల్లోనే అందించేందుకు సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ జీసీసీ స్టాల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన యాజమాన్యం ఇప్పటికే విశాఖ విమానాశ్రయంలో దీనిని ఏర్పాటు చేసి గత మూడు మాసాలుగా దీనిని నిర్వహిస్తోంది. దీనికి దేశ, విదేశీ ప్రయాణికులు, సందర్శకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. త్వరలో ఇదే తరహాలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు విమానాశ్రయాల్లో జీసీసీ స్టాళ్ళు ఏర్పాటు కానున్నాయి. వీటి ఏర్పాటుతో అటవీ ఉత్పతులన్నింటికీ ఆదరణ కల్పించినట్టు అవుతుంది. దీనివల్ల సంస్థ ఆర్థిక లక్ష్యాలను సాధిస్తూనే విద్యావంతులైన గిరిజన యువతకు ఉపాధి కల్పించే అవకాశాలూ మెరుగవుతాయి.