ఆంధ్రప్రదేశ్‌

సైనికుడిలా పనిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, సైనికుడిలా పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకువస్తానని రాష్ట్ర ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రవణ్‌కుమార్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సోమవారం తొలిసారిగా గుంటూరులోని మంత్రి నక్కా ఆనందబాబు క్యాంపు కార్యాలయానికి శ్రవణ్ వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబుతో కలిసి విలేఖర్లతో మాట్లాడారు. చిన్న వయస్సులోనే తనకు మంత్రిగా బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. క్లిష్టపరిస్థితుల్లో మంత్రి పదవి చేపట్టానని గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. చదువుకున్న వ్యక్తిగా గిరిజన ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తానన్నారు. పార్టీకి ఎలాంటి మచ్చ తీసుకురాకుండా పనిచేస్తానని శ్రవణ్ చెప్పారు. తన తండ్రి కిడారి సర్వేశ్వరరావు గొప్ప ఆశయాలు ఉన్న వ్యక్తి అని, ఆయన ఆశయ సాధనకు కృషిచేస్తానని, తన తండ్రి కలలుగన్న లక్ష్యాలను నెరవేర్చడమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, చాలా సమస్యలు పరిష్కారమయ్యాయని, కనెక్టివిటీ పెరగడం వలన సకాలంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోందని, తద్వారా రాష్ట్రంలో మరణాల సంఖ్య తగ్గుతోందని వెల్లడించారు. అనంతరం కిడారి శ్రవణ్‌ను మంత్రి ఆనందబాబు, ఇతర టీడీపీ నేతలు ఘనంగా సత్కరించారు.

చిత్రం..మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న కిడారి శ్రవణ్‌ను సత్కరిస్తున్న మంత్రి ఆనందబాబు, ఇతర నేతలు