ఆంధ్రప్రదేశ్‌

20 రోజుల్లో 1100 డాక్టర్ల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: 20 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1100 వైద్యులను నియమించనున్నట్లు రాష్ట్ర వైద్య మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలందించేలా తరచూ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్యశాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌తో కలిసి పని చేస్తానని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయ సాధన మేరకు ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ను నెలకొల్పుతామని మంత్రి తెలిపారు. సచివాలయం ఐదవ బ్లాక్‌లో రాష్ట్ర వైద్య విద్య, మైనార్టీ శాఖ మంత్రిగా ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ, మైనార్టీశాఖ ఉన్నతాధికారులతో తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ వైద్య విద్య శాఖ బాధ్యతాయుతమైనదన్నారు. గతంలో తాను మున్సిపల్, ఉన్నత విద్య, మైనార్టీ శాఖల మంత్రిగా పని చేశానన్నారు.
జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నానన్నారు. రాబోయే 15 నుంచి 20 రోజుల్లో 1100 వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆరోగ్య శాఖకు ప్రభుత్వం రూ. 8వేల కోట్లు కేటాయించిందన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వాసుపత్రుల ద్వారా పేదలకు నాణ్యమైన సేవలందించేలా ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో పేషంట్లకు సరిపడా పడకలు ఉండడంలేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన మేరకు అదనపు పడకలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. కర్నూలు జిల్లా బ్రాహ్మణకొట్కూరు మండమంలోనూ రూ. 5లక్షలతో మసీదు, అదోని మండలంలో రూ. 15 లక్షలతో చేపట్టిన చర్చి నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లపై తొలి సంతకం చేసినట్లు ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లాలో నకిలీ సర్ట్ఫికెట్లతో వైద్య సేవలందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను ఆదేశిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసినట్లు ఆయన తెలిపారు. వైద్య విద్య, ఆరోగ్యశాఖల పనితీరుపై మంత్రి శ్రావణ్‌తో కలిసి సమీక్షలు చేయనున్నట్లు తెలిపారు.