ఆంధ్రప్రదేశ్‌

ఆదిత్యుని తెప్పోత్సవానికి పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 20: ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకుంటున్న శ్రీ అరసవిల్లి సూర్యనారాయణస్వామి తెప్పోత్సవం కనుల పండువుగా సాగింది. పవిత్ర కార్తీక మాసం ద్వాదశి ని పురష్కరించుకొని సాంప్రదాయబద్ధంగా ఆదిత్యునికి మంగళవారం తెప్పోత్సవం ఇంద్ర పుష్కరిణిలో నిర్వహించారు. ఈ తెప్పోత్సవాన్ని తిలకించేందుకు శ్రీకాకుళంతో పాటు వివిధ ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. తెప్పోత్సవానికి భక్త జనం పోటెత్తడంతో ఆ పరిసరాలు శ్రీవారి బ్రహ్మోత్సవాన్ని తలపించాయి. తొలుత శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, దేవాదాయ శాఖ ఈవో ఆర్.పుష్పనాథం, అధికారులు పూజలు నిర్వహించి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి తెప్పోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెప్పోత్సవం ఆద్యంతం భక్తులు వీక్షించి తరించారు.

చిత్రం..హంస వాహనంపై విహరిస్తున్న సూర్యనారాయణ మూర్తి