ఆంధ్రప్రదేశ్‌

జల రవాణా ప్రాజెక్టుకు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 16: జల రవాణా ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. కాకినాడ నుంచి చెన్నై వరకు బకింగ్ హామ్ కెనాల్‌ను అనుసంధానం చేసుకుంటూ రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు సగానికి పైగా సర్వే పూర్తయింది. ఈ ప్రాజెక్టు సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. ఇప్పటికే నెల్లూరు వరకు సర్వే పూర్తయింది. నెల్లూరు నుంచి చెన్నై వరకు సర్వే కోసం టెండర్లు పిలిచారు. ఇందుకు సంబంధించి త్వరలో మొత్తం సర్వే పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రం నిధులు ఖర్చు చేస్తే కేంద్రం ఈ నిధులను విడుదల చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు కెనాల్స్ వ్యవస్థను కూడా ఈ జల రవాణా ప్రాజెక్టుకు అనుసంధానంగా రూపొందిస్తున్నారు. వెయ్యి టన్నుల సామర్ధ్యం కలిగిన కెనాల్స్‌ను రూపొందిస్తారు. కాకినాడ పుదుచ్చేరి మీదుగా జల రవాణా రూపొందించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 2008లోనే మంజూరు చేసింది. ఇప్పటి వరకు రెండవ తరగతిలో నిర్ధేశించిన ఈ ప్రాజెక్టును మూడవ తరగతిలోకి మార్చారు.