ఆంధ్రప్రదేశ్‌

అవినీతి రహిత పాలన జగన్ అందించటమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), డిసెంబర్ 9: ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రిని అడ్డం పెట్టుకుని నాడు అవినీతి సామాజ్రాన్ని స్థాపించిన వైఎస్ జగన్ సీఎం అయితే తన అవినీతిని అంగారక గ్రహం మీదకూ తీసుకెళ్తాడని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని జగన్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గాంధీని చంపిన గాడ్సే అహింస గురించి, కీచక దుశ్శాసనులు మహిళా సాధికారత గురించి, చింతామణి నాటకంలో శ్రీహరి పాత్ర పాతివ్రత్యం గురించి ప్రభోదిస్తే ఎలావుంటుందో జగన్ వ్యాఖ్యలు అలా ఉన్నాయని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కాకముందే జగన్ అవినీతి సామ్రాజ్యం బెంగళూరు, హైదరాబాద్, కడప, పులివెందుల, ఇడుపులపాయ, తదితర చోట్లకు విస్తరించిందని ఆరోపించారు. పొరపాటునో, గ్రహపాటునో అధికారంలోకి వస్తే ఆయన అవినీతి సామ్రాజ్యం అంగారక గ్రహం మీదకు కూడా విస్తరిస్తుందన్నారు. 11 అవినీతి కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ ప్రతీవారం తిరుగుతున్న జగన్ అవినీతి రహిత పాలన అందిస్తానని చ్పెపడం విడ్డూరమన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3ఏ ప్రకారం రాష్ట్రాన్ని విడగొట్టవచ్చని, తమ పార్టీకి అభ్యంతరం లేదని 2012 డిసెంబర్ 28న జగన్ నాటి కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు లేఖ రాసిన విషయాన్ని మరిచిపోయి, రాష్ట్రాన్ని విడగొట్టిన బాధ్యత కాంగ్రెస్ పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై చట్టం చేయకపోవడం వల్లనే అమలుకు ఇబ్బందలు వస్తున్నాయని జగన్ అనటం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదాకు చట్టం అవసరం లేదని, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సరిపోతుందని, గతంలో రాష్ట్రాలకు కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే ప్రత్యేక హోదా లభించిందని, చట్టం అవసరం లేదన్న విషయాన్ని గతంలో జగన్ పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం జగన్ రెండు నాల్కల ధోరణిని తెలియజేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తామని పదేపదే చెబుతూ వుంటే హోదా కోసం దేవాలయాలకు వెళ్లి కొబ్బరికాయ కొట్టాలని జగన్ పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తప్పకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని, కానీ కొబ్బరికాయలు కొట్టడంతో హోదా రాదని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.