ఆంధ్రప్రదేశ్‌

ఆధునిక సాహిత్యం, అరసంకి మార్క్సిజమే మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 9: ఆధునిక సాహిత్యానికి, అభ్యుదయ రచయితల సంఘానికి మూలం మార్క్సిజమేనని సుప్రసిద్ధ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు. గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రెండు రోజులు జరిగిన ఆంధ్రపదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 18వ రాష్ట్ర మహాసభలు ఆదివారంతో ముగిశాయి. అరసం నేత డాక్టర్ కనపర్తి స్వర్ణలత సాహిత్య వేదికపై ఈతరం కోసం కథాస్రవంతి 11 పుస్తకాల ఆవిష్కరణ (కథా సంపుటాలు) జరిగింది. ఈ కార్యక్రమానికి అరసం ప్రధాన కార్యదర్శి, కథాస్రవంతి ప్రధాన సంపాదకుడు వల్లూరు శివప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్ పాపినేని శివశంకర్ మాట్లాడుతూ ఆధునిక సాహిత్యంలో మహాకవులైన శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, జాషువా వంటివారు ఎంతోమంది అరసంలో సభ్యులుగానో, అభిమానులుగానో ఉంటూ వచ్చారన్నారు. 75ఏళ్ల నిర్విరామ ప్రయాణం సాగించడమంటే ఒక వ్యక్తికి గాని, సంస్థకు గాని అత్యంత కష్టసాధ్యమన్నారు. ప్రస్తుతం మార్క్సిజానికి వ్యతిరేకంగా రకరకాల వాదనలు వస్తున్నాయని, స్ర్తివాద, దళితవాద ఉద్యమాలు వచ్చాయన్నారు. ఆధునిక రచయితలు ఎక్కువగా పుస్తక అధ్యయనం చేయాలని సూచించారు. భూమి మీదున్న ఏ గొప్ప రచయిత అయినా అధ్యయనం చేసినవారేనని ఆయన చెప్పారు. కవులు, రచయితలు సొంత భావాలతో రచనలు ఆవిష్కరించి వైవిధ్యం కనబర్చాల్సిన అవసరం ఉందని సూచించారు. సమాజంలో నైతిక విలువలు పెంపొందించేందుకు రచయితలు కృషిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ రచయితలు డాక్టర్ మధురాంతకం నరేంద్ర, డాక్టర్ కె శ్రీనివాసరావు, ప్రముఖ చిత్రకారుడు పినిశెట్టి, నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విభాగాధిపతి డాక్టర్ ఎన్వీ కృష్ణారావు, ఏపీ రచయితల సంఘం అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, కథా రచయిత కాట్రగడ్డ దయానంద్, తెలుగు భాషోద్యమ సమాఖ్య కార్యదర్శి డాక్టర్ వెన్నిశెట్టి సింగారావు, తదితరులు పాల్గొన్నారు.
అరసం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా
రాచపాళెం, వల్లూరి
అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షునిగా రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (అనంతపురం), ప్రధాన కార్యదర్శిగా వల్లూరి శివప్రసాద్ (గుంటూరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహాసభల ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా డాక్టర్ పి సంజీవమ్మ (కడప), అధ్యక్ష వర్గం సభ్యులుగా డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి (కడప), డాక్టర్ చాగంటి తులసి (విజయనగరం), ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సాకం నాగరాజు (చిత్తూరు) ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక కార్యదర్శిగా ముత్యాల ప్రసాద్ (విశాలాంధ్ర సంపాదకుడు), కార్యదర్శివర్గ సభ్యులుగా కె శరత్ (గుంటూరు), ఎన్ ఈశ్వరరెడ్డి (కడప), బీఎన్ సాగర్ (పశ్చిమ గోదావరి), కలం ప్రహ్లాద (కర్నూలు), ఉప్పల అప్పలరాజు (విశాఖపట్నం), జీఎస్ చలం (విజయనగరం) ఎన్నికయ్యారు.
చిత్రం..సభలో మాట్లాడుతున్న పాపినేని శివశంకర్