ఆంధ్రప్రదేశ్‌

శాంతియుతంగా ‘సేవ్ శబరిమల’ ఉద్యమం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 9: కేరళలోని శబరిమల ఆలయానికి సంబంధించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడులోని అధిక శాతం అయ్యప్ప భక్తులు వినూత్న రీతిలో వ్యతిరేకించేందుకు నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లోని గురుస్వాములు ఈమేరకు అయ్యప్ప స్వాములకు సూచనలు చేశారు. గాంధేయ పద్ధతిలో తమ నిరసన తెలియచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. శబరిమల ఆలయంలోకి మహిళలకు అనుమతిపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వారంలో రెండు రోజులు మహిళలను అనుమతించే అంశాన్ని పరిశీలించేందుకు ముందుకు రావడం తెలిసిందే. సుప్రీం తీర్పు అమలు చేయాలని కొందరు, దాన్ని వ్యతిరేకిస్తూ కొందరు కేరళలో ఆందోళనలు చేయటం తెలిసిందే. ఈనేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని అయ్యప్ప భక్తులు కేరళ ప్రభుత్వ తీరుపై తమ నిరసనను శాంతియుతంగా తెలియచేయనున్నారు. మండల, జ్యోతి దీక్షలు తీసుకుని ఈ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఏటా శబరిమల వెళ్తుంటారు. ఇరుముడి సమర్పించి, కానుకలు అక్కడి హుండీలో సమర్పించడం రివాజు. కానీ భక్తులు ఈసారి తమ నిరసన తెలియచేసేందుకు కానుకలకు బదులుగా హుండీల్లో ‘సేవ్ శబరిమల’ పేరుతో స్లిప్పులు వేయాలని నిర్ణయించారు. భక్తుల ద్వారా భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ మనోభావాలను ప్రభావితం చేసేలా అక్కడి ప్రభుత్వం వ్యవహరించడం, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇలా చేయాలని ఇప్పటికే భక్తులకు గురుస్వాములు దిశానిర్దేశం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రతి అయ్యప్పస్వామి అక్కడి హుండీల్లో స్లిప్పులు వేయనున్నారు. కాగా, వివిధ రాష్ట్రాల్లో కేరళ ప్రభుత్వ తీరుకు వ్యతిరకేంగా అయ్యప్ప భక్తులు నిరసనలు, ర్యాలీలతో హోరేత్తిస్తూ తమ వ్యతిరేకత వ్యక్తం చేయడం తెలిసిందే.