ఆంధ్రప్రదేశ్‌

హ్యాపీనెస్ట్‌కు అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 10: రాజధాని అమరావతిలో నిర్మించే హ్యాపినెస్ట్ అపార్ట్‌మెంట్ ప్లాట్‌లకు అనూహ్య స్పందన లభించిందని పురపాలక మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. సోమవారం హ్యాపినెస్ట్ అపార్ట్‌మెంట్‌లలో మిగిలిన 900 ప్లాట్‌లకు ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం నెల్లూరులో మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడుతూ హ్యాపినెస్ట్‌కు ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభించిన 90 నిమిషాల్లోనే 900 ప్లాట్లు బుక్ అయిపోయాయన్నారు. అమరావతి సమీపంలో నేలపాడు వద్ద 14.4 ఎకరాలలో వీటిని నిర్మిస్తున్నామన్నారు. 12అంతస్థుల భవనం ఉండేవిధంగా నిర్మాణం చేపట్టామన్నారు. మొత్తం 1200 గృహ సముదాయాల (అపార్ట్‌మెంట్స్)ను నిర్మిస్తున్నామన్నారు. రెండు పడకల గదులను రెండు పరిణామాల్లోనూ, మూడు పడకల గదుల ప్లాట్లను పది పరిమాణాల్లోనూ నిర్మిస్తున్నామన్నారు. అమరావతిలో ఇప్పటికే 35వేల కోట్ల రూపాయల పనులు 40శాతం పూర్తయ్యాయన్నారు. ప్రతిపక్ష నేత అమరావతిపై అసత్యాలు చేయటమే పనిగా పెట్టుకున్నారన్నారు. రాజధానిలో ఇంతవరకు ఒక్క ఇటుకరాయి పెట్టలేదని చెప్పడం దారుణమన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఒక్క ఇటుక రాయి పెట్టకుండా అమరావతిలో షీర్‌వాల్ సాంకేతికతతో అద్భుత సౌధాలు నిర్మిస్తామన్నారు.