ఆంధ్రప్రదేశ్‌

మడకశిర ఎమ్మెల్యే రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 14: అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గ శాసనసభ్యుడు కె ఈరన్న తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేగా కె ఈరన్న అనర్హడు అంటూ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. శుక్రవారం వెలగపూడిలోని శాసనసభ కార్యాలయంలో అసెంబ్లీ కార్యదర్శి విజయ రాజుకు తన రాజీనామా లేఖను అందించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాజీనామా లేఖను అందించినట్టు తెలిపారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈరన్న నామినేషన్ సందర్భంగా అఫిడవిట్‌లో పూర్తి వివరాలు తెలపకుండా మోసగించారంటూ వైకాపా తరఫున పోటీ చేసిన డాక్టర్ తిప్పేస్వామి హైకోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో పూర్తిగా విచారించిన కోర్టు ఈరన్న ఎన్నిక చెల్లదంటూ ఇటీవలే తీర్పు ఇచ్చింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లిన ఈరన్నకు అక్కడ కూడా చుక్కెదురు కావడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వైకాపా అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామిని శాసనసభ్యుడిగా కొనసాగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.