ఆంధ్రప్రదేశ్‌

ఐటీ సహా చిన్న కంపెనీల అభివృద్ధికీ ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 19: రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పెద్ద కంపెనీలు ఎంత ముఖ్యమో మధ్య, చిన్నతరహా కంపెనీలకు కూడా ప్రభుత్వం అంతే ప్రాధాన్యత ఇస్తుందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం నగరంలోని మహానాడు రోడ్డులో కే బిజినెస్ స్పేసెస్ కార్యాలయంలో ఏపీ ఆన్‌లైన్ కంపెనీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అద్భుతమైన ఐటీ నైపుణ్యం ఉన్న యువతీ, యువకులు ఉన్నారన్నారు. ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు భూమి కావాలని ఎవరైనా కోరితే ముందుగా కార్యాలయం ప్రారంభించి కనీసం 250 మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించి సంవత్సరం పాటు కార్యకలాపాలు నిర్వహించిన తరువాతనే కేటాయిస్తామన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, ఇంకా చాలా చేయాల్సి ఉందన్నారు. సాఫ్ట్ స్కిల్స్‌పై డిసెంబర్ 10 నుంచి శిక్షణ కార్యక్రమం కూడా మొదలు పెట్టామన్నారు. రాబోయే నెల, రెండు నెలల్లో కూడా పెద్ద కంపెనీలు రాబోతున్నాయన్నారు. ఇప్పటికే హెచ్‌సీఎల్, ఫ్రాంక్లిన్, జోహో లాంటి అనేక పెద్ద ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని మంత్రి లోకేష్ వివరించారు. ఏపీ ఆన్‌లైన్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు, ఏపీ ఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వీ రవికుమార్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఐటీఈ ముఖ్య కార్యదర్శి కే విజయానంద్, ఏపీటీ ఆన్‌లైన్ డైరెక్టర్ వీ రాజన్న, తదితరులు పాల్గొన్నారు.