ఆంధ్రప్రదేశ్‌

తుని సంఘటనలు బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తునిలో కాపుఐక్యగర్జన సందర్భంగా జరిగిన విధ్వంసం, దాడులు అత్యంత బాధాకరమని, తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే ప్రధమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న కొందరు వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. రైలు, పోలీస్‌స్టేషన్‌కు నిప్పుపెట్టారని, దాడులు చేశారని, ఈ సంఘటనల్లో పోలీసులు, పోలీసు అధికారులు చాలామంది గాయపడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న బిసిలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపులను న్యాయం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని ఆయన వివరించారు. ఇప్పటివరకు ఈ విషయంలో ప్రభుత్వం ఏంచేసింది వివరించారు. బిసి కమిషన్‌ను నియమించామని, ఆ కమిషన్ నివేదికకోసం ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు.
అంధకారంలో తుని
తుని: కాగా తుని పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు నిప్పుపెట్టిన అల్లరిమూకలు ఆ తరువాత పోలీస్‌క్వార్టర్స్‌పైకూడా దాడులు చేశారు. దాదాపు 25 పోలీసు వాహనాలు దగ్ధమయ్యాయి. పలువురు పత్రికా విలేకరులకూ గాయాలయ్యాయి.