ఆంధ్రప్రదేశ్‌

మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, జనవరి 9: విజయనగరం జిల్లా పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే యర్రా అన్నపూర్ణమ్మ బుధవారం తన స్వగ్రామం కృష్ణపల్లిలో కన్నుమూసారు. గత కొంతకాలంగా ఆమె అస్వస్థతతో బాధపడుతున్నారు. ఆమె భర్త యర్రా కృష్ణమూర్తి ఆకస్మిక మరణం అనంతరం ఆమె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 1997లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే మృతికి సంతాపంగా బుధవారం పార్వతీపురంలోనే ఉన్న మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, టీడీపీ నేతలు గొట్టాపువెంకటినాయుడు, కొయ్యాన్న శ్రీవాణి, బోనెల సరితకుమారి, మున్సిపల్ వైస్ చైర్మన్ జయబాబు, ఎంపీపీ హరిప్రియా థాట్రాజ్, జడ్‌టీటీసీ గౌరీశ్వరితో పాటు పలువురు కౌన్సిలర్లు తమ సంతాపం తెలిపి వౌనం పాటించారు.