ఆంధ్రప్రదేశ్‌

ఐదు రెట్ల పరిహారం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 11: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టదలచిన భావనపాడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణంపై శుక్రవారం మరోసారి కమిటీ సమావేహమైంది. సమావేశంలో ఐదు రెట్ల పరిహారం కావాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. చివరకు అసంపూర్తి అంగీకారాలతో పోర్టు కమిటీ సమావేశం ముగిసింది. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి, జెసీ చక్రధరబాబు, పోర్టు డైరెక్టర్ కోయ ప్రవీణ్, ఆర్డీవో వెంకటేశ్వరరావు, భావనపాడు గ్రామపంచాయతీ పోర్టు నిర్వాసితుల హక్కుల సాధన కమిటీ అధ్యక్షుడు కారాడ పోతయ్య, ఉపాధ్యక్షుడు సైన గురువులు తదితరులు పాల్గొన్నారు. సువిశాల తీర ప్రాంతమున్న శ్రీకాకుళం తీరాన్ని ఎగుమతులు, దిగుమతులకు కేంద్రంగా చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఇందులో భాగంగానే జిల్లాలోని సంతబొమ్మాళి మండలం భావనపాడు వద్ద గ్రీన్‌ఫీల్డ్ పోర్టును ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. ఒడిశా, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విలువైన ఖనిజ సంపదను ఈ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేయడానికి, అలాగే ఏపీ సహా పైన పేర్కొన్న రాష్ట్రాల్లో స్టీల్, విద్యుత్ పరిశ్రమలకు అవసరమైన బొగ్గును దిగుమతి చేసుకోవడానికి దీన్ని ఉపయోగించాలనేది లక్ష్యం. చాలా కాలం నుంచి ప్రతిపాదనలకే పరిమితమైన ఈ పోర్టు నిర్మాణం 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో మరోసారి తెరపైకి వచ్చింది. తమ ప్రభుత్వం వస్తే భావనపాడు వద్ద గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మిస్తాం అంటూ ప్రకటించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం 2015లో పోర్టు నిర్మాణానికి ఓ అడుగు ముందుకేసింది. ఇందులోభాగంగానే 14 బెర్తులతో 30.57 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మితమయ్యే భావనపాడు పోర్టు కార్యకలాపాల కోసం సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లో పదివేల ఎకరాలను సేకరించాలని తొలుత భావించింది. దీనిపై ప్రజలు ఆందోళన చేయడంతో కేవలం 4923 ఎకరాలను సేకరించేందుకు 2015 ఆగస్టు 28న నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం పోర్టుకు కావల్సిన భూములను భావనపాడు, మర్రిపాడు, కొమరల్తాడ, దేవునల్తాడ పంచాయతీల నుంచి సమీకిరంచాలని భావించారు. భూసేకరణ చట్టం - 2013 మార్గదర్శకాలకు లోబడే భూసేకరణ ఉంటుందని, భోగాపురం ప్యాకేజీ తరహాలో ఎకరా భూమి ఇచ్చిన వారికి రూ. 33 లక్షలు, ఇళ్ళు కోల్పోతున్నవారికి 40 సెంట్ల స్థలంలో డబుల్‌బెడ్ రూమ్ హౌస్ కట్టిస్తామని హామీ ఇచ్చారు. కానీ, శుక్రవారం జరిగిన పోర్టు కమిటీ సమావేశంలో నిర్వాసితుల హక్కుల సాధన కమిటీకి చెందిన కారాడ నీలకంఠం సరికొత్త డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించారు. భూములు, స్ట్రక్చర్లు, ఇతర నష్టాలకు సంబంధించి ఐదు రెట్ల పరిహారం కావాలని డిమాండ్ చేసారు. భావనపాడు, అల్తాడ గ్రామాల మధ్య నుంచి పోర్టు ముఖద్వారం నిర్మించాలనే ప్రతిపాదనపై స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు గ్రామాలకు చెందిన పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాటిని ఉపసంహరించుకునేలా మంత్రి అచ్చెన్న కృషి చేశారు. ఇప్పుడూ అటువంటి ప్రయత్నమే మరోసారి మంత్రి అచ్చెన్న చేసారు. కానీ, భావనపాడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టుపై ఇప్పటికీ ముగింపుదొరికినట్టుగా కనిపించలేదు.
భావనపాడు పోర్టు నిర్మాణంపై ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. పోర్టు నిర్మాణంపై సరిగ్గా ఓ క్లారిటీ లేకుండానే కనీసం ప్రజాభిప్రాయం సేకరించకుండానే 2015లో భూసమీకరణకు నోటిఫికేషన్ జారీ చేసారు. పోర్టు నిర్మాణం వల్ల సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు, మర్రిపాడు పంచాయతీలు, వజ్రపుకొత్తూరు మండలంలోని కొమరల్తాడ, కొత్తపేట, పొల్లాడ, దేవునల్తాడ పంచాయతీల పరిధిలోని గ్రామాలన్నీ తరలించాల్సి ఉంటుంది. ఇక్కడ చేపల చెరువులు, ఉప్పుమడుగులపై పరోక్షంగా ఆధారపడిన మరో మూడు వేల మంది ఉపాధికి గండి పడుతుంది. అసలు ఇంత పెద్ద పోర్టు నిర్మాణం చేపట్టేముందు కనీసం తమ అభిప్రాయాలు తీసుకోనక్కర్లేదా అని నిర్వాసిత గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకే పోర్టు కమిటీ సమావేశం జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో జోడించి మంత్రి అచ్చెన్న అధికారుల సమక్షంలో ఏర్పాటు చేశారు.ఈ పోర్టు నిర్మాణం ప్రతిపాదన కంటే ముందునుంచే ఇక్కడ మత్స్యకారులకు ఉపయోగపడేలా ఫిషింగ్ హార్బర్ నిర్మాంచాలనే డిమాండ్ ఉంది. కానీ, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే భావనపాడు పోర్టును నిర్మించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పింస్తామంటూ హామీ ఇచ్చి నాలుగేళ్ళుగా పోర్టు పనులు అడుగు ముందుకు పడలేదు. ఫిషింగ్ హార్బర్ అంతకన్నా లేదు. దీంతో మత్స్యకారులు ఎట్టిపరిస్థితులోనూ పోర్టు నిర్మాణం కోసం భూమి ఇచ్చేది లేదని తెగేసి చెబుతన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యం (పీపీపీ) పద్దతిలో గుజరాత్‌కు చెందిన కార్పొరేట్ సంస్థ అదానీ గ్రూప్‌కు అప్పగించడానికి మూడేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వుం ఆపసోపాలు పడింది. చివరకు పీపీపీ పద్ధతితోనే భావనపాడు పోర్టు నిర్మాణం అంటూ గతంలో కేబినేట్ సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని, ప్రకటించారు. అదానీ గ్రూపు సమర్పించిన ఫైనాన్షియల్ నివేదికలో పోర్టు రెవెన్యూలో రాష్ట్రానికి కేవలం 0.5 శాతం మాత్రమే వాటాను ప్రతిపాదించింది.
దేశంలో ఇప్పటివరకూ పోర్టులను తీసుకున్న ప్రైవేటు సంస్థలు 2 నుంచి 2.5 శాతం వరకూ రెవెన్యూ వాటా ఇస్తున్నాయి. తొలుత పదివేల ఎకరాల వరకూ భూసేకరణ లక్ష్యంతో దిగిన ప్రభుత్వం చివరకు 2,554 ఎకరాలతో సరిపట్టుకుంటామని ప్రకటించింది. దీనిలో 268 ఎకరాలు ఇప్పటికే పోర్టులశాఖ ఆధీనంలో ఉంది. మిగతాది రైతుల నుంచి సేరకించాల్సివుంది. కానీ, పోర్టు కోసం సర్వం కోల్పోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూన్నారు. ఉద్యోగాలు, ప్యాకేజీలు, తరలింపు, నష్టపరిహారం ఇవేమీ కొలిక్కిరాకుండానే మూడున్నర ఏళ్ళ క్రితం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ఫలితంగా రైతులు తమ జిరాయితీ భూములు క్రయవిక్రయాలకు నోచుకోక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడో నిర్మించే పోర్టు కోసం ఇప్పటి నుంచే తమను ఇబ్బంది పెట్టడం భావ్యంకాదని, క్రయవిక్రయాలు జరుపుకునేలా నోటిఫికేషన్ ఎత్తివేయాలని కమిటీ సమావేశంలో నిర్వాసితులు మంత్రి అచ్చెన్నను కోరగా ప్రజలను కష్టాల్లోకి నెట్టి పోర్టు నిర్మించాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదన్నారు.