ఆంధ్రప్రదేశ్‌

పవిత్ర సంగమం నుండి రాజధానికి ఐకానిక్ వంతెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 11: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తలమానికంగా నిలిచే ఐకానిక్ వంతెన పనులకు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ శ్రీకారం చుడుతోంది. విజయవాడ నగరానికి సమీపంలోని ఇబ్రహీంపట్నం దగ్గర పవిత్ర సంగమం నుండి రాజధాని ప్రాంతంలోని తాళ్లాయిపాలెం వరకు కృష్ణా నదిపై ఈ వంతెన నిర్మించనున్నారు. నిర్మాణ పనులను అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసి) పర్యవేక్షిస్తుంది. 3.2 కిలోమీటర్ల మేర ఆరు వరుసలుగా దీన్ని నిర్మిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా 12న ఉదయం ఐకానిక్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. ఈమేరకు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. పవిత్ర సంగమం దగ్గర గోదావరి ఘాట్‌లో శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఇందుకోసం స్టాక్ యార్డును ఇప్పటికే సిద్ధం చేశారు. నదిలో పిల్లర్లు వేసేందుకు అవసరమైన అతిపెద్ద ఐరన్ ఫంట్స్ (బార్జ్‌లు) సిద్ధం చేసి నదిలోకి దింపుతున్నారు. ఇంజనీర్లు మార్కింగ్‌ను పూర్తిచేశారు. ఫైల్ కాంక్రీటుకు మెటీరియల్ త్వరలో వస్తుందని అధికారులు తెలిపారు. నదిలో 36 పిల్లర్లు నిర్మించాల్సి ఉంది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వరకు ఈ వంతెన నిర్మిస్తారు.