ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా ముగిసిన పుస్తక మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 13: నగరంలోని స్వరాజ్య మైదానంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి 13రోజులు జరిగిన 30వ విజయవాడ పుస్తక మహోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా ముగిసింది. గత 30ఏళ్లుగా ఏటా 11రోజులు జరిగే పుస్తక మహోత్సవం ఈ ఏడాది 13రోజులు కొనసాగింది. పుస్తక మహోత్సవంలో ఈ ఏడాది 290 స్టాళ్లు ఏర్పాటు చేశారు. అన్ని రకాల రచనలు, ప్రచురణకర్తలు, విభాగాలకు సంబంధించిన పుస్తకాలు కొలువుదీరాయి. కనీసం 5లక్షల మంది పుస్తకప్రియులు సందర్శించారని అంచనా. ఈసారి 13రోజుల ప్రదర్శన కావడంతో పుస్తకప్రియులు అనుకున్న లక్ష్యం కంటే అధికంగానే వచ్చారని వీబీఎఫ్‌ఎస్ గౌరవాధ్యక్షుడు బాబ్జీ వెల్లడించారు. ఆదివారం సెలవు కావడంతో పుస్తక మహోత్సవానికి సందర్శకులు భారీ సంఖ్యలో వచ్చారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఈ ఏడాది రూ. 3కోట్ల వరకు పుస్తకాల అమ్మకాలు సాగినట్లు అంచనా. ఈసారి ఆధ్యాత్మికం, అకడమిక్స్‌కు సంబంధించిన పుస్తకాలు అధికంగా అమ్ముడయ్యాయి. ఆరోగ్యం, పోషకాహారం, చిరుధాన్యాలకు సంబంధించిన పుస్తకాలు సైతం పెద్దసంఖ్యలో అమ్ముడయ్యాయి. మళ్లీ వచ్చే ఏడాది 31వ ప్రదర్శనను ఇంతకంటే బాగా నిర్వహించనున్నామని పుస్తక మహోత్సవ ప్రతినిధులు తెలిపారు.