ఆంధ్రప్రదేశ్‌

హరితాంధ్రకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్‌కు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియచేశారు. బుధవారం విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో 36,915 చదరపు కిలో మీటర్ల పరిధిలో అటవీ ప్రాంతం,4,243 చదరపు కిలో మీటర్ల పరిధిలో అవుట్‌సైడ్ ఫారెస్ట్ ఉందని చెప్పారు.అలాగే 13 లక్షల హెక్టార్లలో డిగ్రెడ్ ఫారెస్ట్ ఉందని అన్నారు. మొత్తం మీద 26 శాతం మాత్రమే గ్రీనరీ ఉందని చెప్పారు. సంవత్సరానికి నాలుగు లక్షల ఎకరాల చొప్పున మొక్కలు నాటితే, 2029 నాటికి రాష్ట్రంలో గ్రీనరీని 50 శాతానికి పెంచగలుతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 29న రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. ఆక్సిజన్ పీల్చే ప్రతి వ్యక్తి మొక్క నాటాల్సిందేనని చెప్పారు. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ప్రజా ప్రతినిధి మొక్కలు విధిగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. గృహాలు, పరిశ్రమలు, విద్యాలయాలు ఇలా ప్రతి ఒక్కచోట పెద్ద ఎత్తున గ్రీనరీ పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. సముద్రం, నదీ తీరాల్లో పటిష్ఠమైన చెట్లు పెంచుతామని చంద్రబాబు చెప్పారు. ఇందుకోసం ట్రీ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రి చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని అన్నారు. నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగ్ చేస్తామని, ఎప్పటికప్పుడు ఆ మొక్కల సంరక్షణను పరిశీలిస్తామని అన్నారు. అవసమైతో డ్రోన్ కెమేరాలతో మొక్కల స్థితిగతులు తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే చేయిస్తామని ఆయన చెప్పారు. మూడు నెలలకోసారి నాటిన మొక్కలు పరిస్థితిని సమీక్షిస్తామని ఆయన తెలియచేశారు.
అటవీ ప్రాంతంలో మొక్కల పెంపకం బాధ్యతను వన సరంక్షణ సమితులకు అప్పగిస్తామని, గ్రామాల్లో ఈ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగించి, వారికి వంద రోజులు పని కల్పిస్తామని సిఎం చెప్పారు. మొక్కల పెంపకానికి అయ్యే ఖర్చును నరేగా నుంచి తీసుకుంటామని ఆయన తెలియచేశారు. చాలా చోట్ల పండ్లు, ఔషధ మొక్కలను నాటుతామని ఆయన వివరించారు. రాయలసీమలో ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తామని సిఎం తెలియచేశారు. నగరాల్లో నగర వనాలను పెంచుతామని చెప్పారు. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు ఒక ఐఎఎస్, ఒక ఫారెస్ట్ అధికారిని రాష్ట్రం నుంచి జిల్లాలకు పంపుతామని సిఎం చంద్రబాబు వివరించారు.
గ్రీనరీని బాగా అభివృద్ధి చేసిన అధికారులకు ఒకటి, రెండు ఇంక్రిమెంట్‌లు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు తెలిపారు. అలాగే మొక్కలను బాగా పెంచిన వారికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఆవార్డులు ఇస్తామని ఆయన చెప్పారు.
chitram...
విలేఖర్లతో మాట్లాడుతున్న చంద్రబాబు