ఆంధ్రప్రదేశ్‌

టోల్‌గేట్ నిర్వాహకుల ఇష్టారాజ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 13: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, విశాఖ, కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు భారీగా ప్రజలు తరలివెళ్తుండటం, టోల్‌గేట్ల వద్ద కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఆగిపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో టోల్‌ఫీజులను రద్దుచేస్తూ రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులతో తమకు సంబంధం లేదని కొందరు, తమ చేతికి అందలేదని మరికొందరు ఆదివారం ఉదయం వరకు కూడా యథావిథిగా టోల్‌ఫీజు వసూలు చేస్తుండటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన డీజీపీ ఆర్పీ ఠాకూర్ పోలీసు అధికారులను టోల్‌ప్లాజాలకు పంపారు. ఎక్కడా టోల్‌ఫీజు వసూలు చేయకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. ఇదిలావుండగా, ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అక్రమంగా టోల్‌ఫీజులు వసూలు చేసిన నిర్వాహకులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడ - హైదరాబాద్ హైవేపై నిర్దాక్షిణ్యంగా టోల్‌ఫీజులు వసూలు చేయడం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత, చేతగాని తనానికి నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు.