ఆంధ్రప్రదేశ్‌

23న డిజిపి రాముడు పదవీ విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ రాముడు ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ డిజిపిగా నండూరి సాంబశివరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. డిజిపి రాముడు ఈనెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రెండు నెలలపాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, రాముడు అందుకు అంగీకరించలేదని తెలిసింది. దీంతో 23వ తేదీన రాముడు పదవీ విరమణ చేయనున్నారు. ఆ రోజు ఉదయం రాముడుకు పోలీసులు వీడ్కోలు పలకనున్నారు. అదే రోజు మధ్యాహ్నం సాంబశివరావు డిజిపిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సాంబశివరావు ప్రస్తుం ఆర్టీసి ఎండిగా పనిచేస్తున్నారు. ఆర్టీసి ఎండిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ఆ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. ప్రయాణిలకు ఆర్టీసిని మరింత చేరవకు తీసుకువచ్చారు. 1974-79 మధ్య ఆంధ్రా యూనివర్శిటీలో మెకానికల్-మెరైన్ ఇంజనీరింగ్‌లో బిఇ పూర్తి చేసిన సాంబశివరావుఐఐటి ఖరగ్‌పూర్‌లో ఐఐటిలో టాపర్‌గా నిలిచారు. గత ఏడాది జనవరి నుంచి ఆర్టీసి ఎండిగా పనిచేస్తున్నారు. అంతకు ముందు ఆయన అప్పా డైరక్టర్‌గా కూడా పనిచేశారు.

నెల్లూరు డిఇఒను
సరెండర్ చేసిన కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 20: ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన నెల్లూరు జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖాధికారి (డిఇఒ) డి ఆంజనేయులును ప్రభుత్వానికి సరెండర్ చేశారు. దాంతో ఆయనపై విచారణకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ పి సిసోడియా ఆదేశించారు. దర్యాప్తు కొనసాగుతుండగానే ఆయనను సంచాలకుడి కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ ట్రైనింగ్ పోస్టులో నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

విజయవాడలో జాతిపిత
విగ్రహాన్ని కూల్చేశారు
ఏపి సర్కారుపై విహెచ్ ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 20: విజయవాడలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లకు అడ్డుగా ఉందని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూల్చి వేయించారని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి.హనుమంత రావు ఆరోపించారు. 2000 సంవత్సరంలో విజయవాడలో జాతిపిత విగ్రహాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు అన్నాహజారే ఆవిష్కరించారని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. తాను అన్నాహజారేను కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించాల్సిందిగా కోరగా, హజారే సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం జాతిపిత విగ్రహాన్ని కూల్చి వేయడం దారుణమని విమర్శించారు.