ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేని జగన్‌కు ఇక్కడి ఓట్లెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 14: సొంత రాష్ట్ర పోలీసులపై ఏమాత్రం నమ్మకం లేని ప్రతిపక్ష నేత జగన్‌కు ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పింఛన్లను క్రమంగా పెంచుతూ నిస్సహాయులకు చేయూతనిస్తున్నారని చెప్పారు. గతంలో రూ.200 ఉన్న వృద్ధాప్య పింఛన్లను ఏకంగా వెయ్యి రూపాయలకు పెంచగా, ఈ జనవరి నుంచి వారందరికీ రూ. 2వేలు చేస్తూ సగర్వంగా ప్రకటించారన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సంక్రాంతి కానుకగా పేద బ్రాహ్మణులకు వృద్ధాప్య పింఛన్ రూ. 2వేలు అందజేయనున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని బ్రాహ్మణ యువతులకు నియోజకవర్గానికి 100 కుట్టుమిషన్లు అందజేస్తామన్నారు. ఇప్పటివరకు బ్రాహ్మణులకు కార్పొరేషన్ ద్వారా రూ. 270 కోట్లు ఖర్చు చేశామని, మరో రూ. 15కోట్లు వెచ్చించటానికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పేద అర్చకులు, వేద పండితులను పెళ్లి చేసుకునే అమ్మాయిలకు రూ. 75వేలు కల్యాణమస్తు పథకం ద్వారా ఇస్తున్నామన్నారు. రాష్ట్రం రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్నా సంపద సృష్టించి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర ప్రజలు మళ్లీ గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న ముఖ్యమంత్రిపై హైదరాబాద్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కుమార్తె షర్మిళ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయటం అనుచితమన్నారు. తనపై సోషల్ మీడియాలో వచ్చిన అసభ్యకర వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయటంలో తప్పులేదని, కానీ సీఎంపై ఫిర్యాదును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేకపోవటం వల్లే పక్క రాష్ట్రంలో ఫిర్యాదు చేశామని ఆమె అనటం హాస్యాస్పదమన్నారు. ఐదేళ్లుగా పోస్టింగ్‌లు వస్తుంటే ఇప్పుడే ఆమెకు మెలకువ వచ్చిందా? అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి కుమార్తెగా ఆమెకు తగిన గౌరవ మర్యాదలు లభిస్తాయని, కానీ తనపై అసభ్య వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ ప్రోత్సహిస్తోందని ఆమె ఆరోపించటం చాలా వింతగా, విడ్డూరంగా ఉందని ఖండించారు. రాష్ట్ర పోలీస్ శాఖ తన సోదరుడు జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రకు పూర్తిగా భద్రత కల్పించిన విషయాన్ని షర్మిల మరచిపోవటం అన్యాయమన్నారు. కోడికత్తి డ్రామాతో రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని జగన్ చెబుతున్నారని, ఇదే పద్ధతిలో ఆయన సహోదరి షర్మిళ కూడా విమర్శలు చేయటం హాస్యాస్పదమని ఆనందసూర్య ఖండించారు.