ఆంధ్రప్రదేశ్‌

ఏఎన్‌యూ ఇన్‌చార్జి విసీగా రామ్‌జీ నియామకంపై వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 16: ముఖ్యమంత్రి మైండ్ సెట్‌తో ఉపకులపతిగా విద్యావ్యవస్థలో ప్రభుత్వ పథకాలను గ్రామదర్శిని ద్వారా ప్రజల ముంగిటకు పెట్టే ప్రయత్నం చేసిన అంబేద్కర్ యూనివర్సిటీ విసీ కూన రామ్‌జీ చేసిన సేవలకు, సిన్సియారిటీకి గుర్తింపుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(ఏఎన్‌యు) ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా రామ్‌జీని నియమించారు. ఇటీవల జరిగిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియామకాల్లో అత్యంత కీలకంగా నిర్ణయాలు తీసుకుని అవినీతి పోకడలు లేకుండా పూర్తి చేసినందుకు ఏఎన్‌యు ఇన్‌ఛార్జి విసీగా రామ్‌జీని సిఎంవో కార్యాలయం ఎంపిక చేసిందనడంలో అతిశయోక్తిలేదు. కానీ, ఆ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మాత్రం రామ్‌జీ నియామకం అసంతృప్తి, ఆగ్రహం రెండూ కలిగించాయి. మూడు సార్లు తర్జనభర్జనలతో గవర్నర్, ముఖ్యమంత్రి, మానవ వనరులశాఖ మంత్రికి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌కు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సమాలోచనలు, రెండు జీవోలు నడుమ చివరకు ఆచార్య కూన రామ్‌జీని ఏఎన్‌యు ఇన్‌ఛార్జి వీసీగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఆయన అక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వైస్‌ఛాన్సలర్ రామ్‌జీ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నియామకం వెనుక ఆయన ప్రమేయం, ప్రయత్నం లేకపోయినప్పటికీ, రాజకీయ పరిణామాలు ఆచార్యులు రామ్‌జీని ఇరకాటంలో నెట్టేశాయి. పొరుగు జిల్లా మంత్రిగా గంటా శ్రీనివాసరావుతో సత్సంబంధాలు కలిగి, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సోదరుడు, శ్రీకాకుళం జిల్లా పెనుబర్తి గ్రామానికి చెందిన ఆచార్యులుగా, మంత్రి కళా వెంకటరావు ఆశీస్సులతో అంబేద్కర్ యూనివర్సిటీ వీసీగా చాలా గట్టిపోటీ, కులాల మంత్రాంగాల నడుమ నియామకమైన రామ్‌జీ తన పాలనాపరమైన అంశాల్లో రాజకీయ ఒత్తిళ్ళకు దూరంగా ఉంచుతూ అంబేద్కర్ యూనివర్సిటీని గతంలో ముద్రపడిన ఉప‘కుల’పతుల్లా కాకుండా విధులు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ఆచార్య నాగార్జున వర్సిటీ ఇన్‌ఛార్జి నియామకం మంత్రి గంటా - వీసీ రామ్‌జీల మధ్య దూరాన్ని పెంచింది. ఇంతకుముందు నాగార్జుయూనివర్సిటీ ఇన్‌ఛార్జి విసీగా ఇక్కడే వీసీగా కాలపరిమితి ముగించుకున్న ప్రొఫెసర్ ఎ.రాజేంద్రప్రసాద్‌ను నియమిస్తూ ఈ నెల 11వతేదీన ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి చివరికి సి.ఎం. క్యాంపు కార్యాలయానికి చేరాయి. ఏపీ యూనివర్సిటీ చట్టాన్ని అతిక్రమించారన్న ఫిర్యాదులు కూడా గవర్నర్, ముఖ్యమంత్రికి చేరాయి. అక్కడ రెక్టార్‌నే ఇన్‌ఛార్జి విసీగా నియమించాలంటూ మంత్రి గంటా ప్రతిపాదనను పక్కనపెట్టి రాజేంద్రప్రసాద్‌ను నియమించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి గంటా రగడ ఆరంభించడంతో రాజేంద్రప్రసాద్ నియామకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత రద్దే చేసింది. రెక్టార్‌ను ఇన్‌ఛార్జి విసీగా నియమించాలన్న గంటా ప్రతిపాదనను సీఎంవో నిర్వర్తిస్తుందన్న ఆలోచనలను తారుమారు చేస్తూ అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ కూన రామ్‌జీని ఇన్‌ఛార్జి విసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లిఖితపూర్వకంగా మంత్రి గంటా రెక్టార్‌ను నియమించాలని చేసిన ప్రతిపాదనను సిఎంవో అధికారులు తోసిపుచ్చి మంత్రి అసంతృప్తికి లోనుకావడం సహజం. కానీ, ఆ అసంతృప్తి, తర్వాత కలిగిన ఆగ్రహం అంబేద్కర్ వర్సిటీ వీసీ రామ్‌జీపై చూపించడం ఎంతవరకూ సమంజసమంటూ ఆచార్యుల్లో చర్చ మొదలైంది. మంత్రి గంటా రగడ తర్వాత నియమించిన రాజేంద్రప్రసాద్ ఈ నెల 11వతేదీన ఉత్తర్వులు అందుకోవడం, మళ్లీ ఆ ఉత్తర్వులు పెండింగ్‌లో పడడంతో రాత్రికిరాత్రి పలు ఫైళ్ళపై సంతకాలు చేశారన్న ఆరోపణలు గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రి గంటా, ఉన్నతవిద్యామండలి చైర్మన్, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదులు పంపినట్టు వర్సిటీ వర్గాలు చెప్పుకొచ్చాయి. అలాంటి సమయంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దమయంతి జీవో.నెం.ఆర్టీ 14ను ఇస్తూ అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ఆచార్యులు కూన రామ్‌జీని ఆచార్యనాగార్జునయూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. ఈమేరకు ఆయన గురువారం అక్కడ విసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కానీ, రామ్‌జీని ఆ పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఆటంకాలను గంటా పెషీ నుంచి ఒత్తిడి పెరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, వీసీ రామ్‌జీ తరుఫున గంటా శ్రీనివాసరావుతో మంతనాలు జరిపినట్టు తెలియవచ్చింది. ఇన్‌ఛార్జి వీసీగా ఉత్తర్వులు కావాలంటూ రామ్‌జీ ప్రయత్నం చేయకపోయినా, ఆయనను ప్రభుత్వం ఎంపిక చేసిన విధానాన్ని విడమరిచి చెప్పినట్టు తెలిసింది. కానీ, మంత్రి గంటా మాత్రం ఆచార్యులు రామ్‌జీ పట్ల ఆగ్రహంతో, ఆయన నియామకం పట్ల అసంతృప్తినే వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఉన్నతవిద్యాశాఖలో ఆచార్యులుగా విధులు నిర్వర్తిస్తూ, ఆ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పొరపొచ్చలు ఏర్పడడం పట్ల అంబేద్కర్ వర్సిటీ విసీ రామ్‌జీ మదనపడుతున్నట్టు ఆయన సహచరులైన ఆచార్యులు చెప్పుకొచ్చే మాట. అయితే విసీ రామ్‌జీని ‘ఆంధ్రభూమి’ ఈ సంఘటనపై వివరణ కోరగా మంత్రి గంటాతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని, ఎటువంటి దూరం పెరగలేదంటూ చెప్పారు. ఈ నెల 17వ తేదీన ఎఎన్‌యూ ఇన్‌ఛార్జి విసీగా బాధ్యతలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.