ఆంధ్రప్రదేశ్‌

పడవ ప్రమాదాల నివారణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 18: కృష్ణా, గోదావరి నదులను దాటేందుకు ప్రమాద రహిత బోట్లను సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో పడవ ప్రమాదాల నివారణ చర్యలపై సీఎస్ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన మూడు సంవత్సరాల్లో 67 మంది పడవ ప్రమాదాల్లో చనిపోయారన్నారు. ఇకపై ఈ ప్రమాదాలు జరుగకుండా రక్షణ ఉన్న అధునాతన బోట్లను కొనుగోలు చేసేలా చూడాలన్నారు. పడవలకు లైసెన్సుల జారీ, శిక్షణ తీసుకున్న చోదకుల నియామకం వంటి చర్యల ద్వారా ప్రమాదాలను చాలా వరకూ తగ్గించవచ్చన్నారు. ప్రయాణికులను తరలించే పడవలకు అనుమతులు తప్పనిసరి చేసి, గడువులోగా లైసెన్సులు ఇవ్వాలన్నారు. జలవనరులు, పోలీస్, అగ్నిమాపక, పంచాయతీరాజ్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించుకుని, ప్రమాదాల నివారణపై సమీక్ష చేయాలని ఆదేశించారు.