ఆంధ్రప్రదేశ్‌

‘అభివృద్ధిని అడ్డుకోవడానికే ఫెడరల్ ఫ్రంట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, జనవరి 18: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవడానికే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కుట్రకు పాల్పడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యునమల రామకృష్ణుడు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు 23వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి యనమల మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్, మోదీ కలసి రాష్ట్రాన్ని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రానికి అన్యాయం చేయాలనే ఉద్ధేశ్యంతోనే మోడీతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. కేసీఆర్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. విభజన చట్టంలోని అంశాలను ఇప్పటకీ మోదీ ప్రభుత్వం అమలుచేయలేదని, కేవలం 5నుండి 6వేల కోట్లు రూపాయలు రాష్ట్రానికి ఇచ్చి ఇక తమపని అయిపోయినట్లు భావిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీ మేరకే ఆపార్టీతో కలసి పనిచేస్తున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పిన మోదీతో జగన్ ఏవిధంగా చేతులు కలుపుతారని యనమల ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.