ఆంధ్రప్రదేశ్‌

పాత పెన్షన్ పునరుద్ధరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల కేడర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ సాబ్జీ, పీ బాబురెడ్డి కోరారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గం విజయవాడ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగింది. అనంతరం వీరు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పిడిఎఫ్ ఎమ్మెల్సీ వీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 1.82 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పెరగడం అభినందనీయమని, దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఉపాధ్యాయుల నియామకం చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ ఖాతాలను ప్రారంభించాలని, నియోజకవర్గానికి ఒక డివైఇఓ పోస్టు మంజూరు చేయాలని, 500 దాటిన ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియేట్ ప్రారంభించాలని కార్యవర్గం తీర్మానించింది.