ఆంధ్రప్రదేశ్‌

గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్‌లో ఏపీకి 49వ ర్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ కాంపిటేటివ్‌నెస్ ఇండెక్స్ 4.0లో ఏపీకి 49వ ర్యాంక్ సాధించింది. ఇదే సమయంలో భారత్‌కు 58వ ర్యాంక్ లభించింది. భారత్ 62.06 స్కోరు చేయగా, ఏపీ 63.92 స్కోరు సాధించడం విశేషం. ఈస్టు యూరోపియన్ దేశాల కంటే ఏపీ ముందు ఉండటం గమనార్హం. 98 అంశాలను ప్రామాణికంగా తీసుకుని ర్యాంక్‌లను నిర్ణయించారు. సంస్థలు, వౌలిక సదుపాయాలు, ఐసీటీ, లేబర్ మార్కెట్ తదితర అంశాల్లో దేశం కంటే ఏపీ ముందు ఉంది. నైపుణ్యాలు, ఫైనాన్షియల్ సిస్టమ్, నూతన ఆవిష్కరణల్లో గతంలో కంటే ఏపీ పురోగతి సాధించింది. సోషల్ క్యాపిటల్ ఇండెక్స్, క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఇండెక్స్‌ల్లో జాతీయ బెంచ్ మార్కును దాటి ఏపీ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 140 ఆర్థిక వ్యవస్థలను మదింపు చేసి ఈ ర్యాంక్‌లను ఫోరమ్ వెలువరించింది.