ఆంధ్రప్రదేశ్‌

సాకారమైన బాబు భగీరథ యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జనవరి 21: చిత్తూరు జిల్లాను పట్టి పీడస్తున్న కరవు పరిస్థితులను అధిగమించడానికి నిర్ధేశించిన హంద్రీ -నీవా జలాలు ఎట్టకేలకు జిల్లాకు చేరాయి. దీంతో దశాబ్దం నాటి జిల్లా వాసులు కల సాకారమైంది. ఆదివారం రాత్రికే ఈ జలాలు జిల్లాలో ప్రవేశించగా, మంగళవారం పెద్దతిప్ప సముద్రం మండలం వద్ద వేలాది మంది రైతులు సమక్షంలో అట్టహాసంగా కృష్ణా జలాలకు జలహారతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు, ఇందుకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు , ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతానికి కృష్ణా జలాలను తరలించాలని చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టుకు అనేక అవరోధాలు ఎదురైనా ఎట్టు కేలకు పనులు పూర్తయి కృష్ణా జలాలు జిల్లాలో ప్రవేశించడంతో జిల్లా వాసులు చిరకాల స్వప్నం నెరవేరినట్టయింది. తరుచూ వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో జిల్లా వాసులు కరవు పరిస్థితులతో సాగు -తాగు నీరు లేక అవస్థలు పడుతూ వలసలు పోతున్న తరుణంలో జిల్లాకు సాగు తాగు నీరు అందించాలన్న సంక్పలంతో దివంగత ముఖ్యమంత్రి రామారావు జిల్లాకు హంద్రీ నీవా ద్వారా నీరు మళ్లించాలన్న బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, తరువాత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి దీన్ని కొనసాగిస్తూ కాల్వలు తవ్వడం వంటి పనులు చేపట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో ముందడుగు వేసి కృష్ణమ్మ నీటిని ఎట్టకేలకు హంద్రీ నీవా ద్వారా జిల్లాకు తీసుకు రావడంలో ఈ ప్రాజెక్టుపై ఉన్న అపోహలకు తెరపడింది. దీంతో ఆదివారం రాత్రి అనంతపురం జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి ఈ జలాలు పెద్దతిప్ప సముద్రం మండలానికి చేరుకున్నాయి. ముందుగా ఈ నీటిని పీటీఎం ఎత్తి పోతల పథకం ద్వారా పీటీఎం చెరువుకు, అక్కడ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు మళ్లించి దశల వారిగా కుప్పం వరకు తీసుకెళ్లనున్నారు. జిల్లాలో పడమటి కరవు నేలను తడుపూతూ ముందుకు సాగుతున్న ఈ జలాలు జిల్లాలోని ఎనిమిది నియోజక వర్గాల్లో 1.40లక్షల ఎకరాలకు సాగు నీరు పది లక్షల మందికి దాహర్తిని తీర్చినున్నాయి. అనంతపురం జిల్లా జీడిపల్లి వద్ద 16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన జలాశయం ప్రస్తుతం నిండింది. అక్కడి నుంచి ప్రధాన కాల్వల ద్వారా కదిరి సమీపంలోని చెర్లో పల్లి జలాశయానికి అక్కడ నుంచి లిప్టులు ద్వారా ఈ జిల్లాకు తరలించనున్నారు. దీని వల్ల జిల్లా పరిధిలో సుమారు 70 కిలో మీటర్ల పొడవున ప్రధాన కాల్వ సాగనుండగా , పుంగనూరు, తంబళ్ళపల్లి , కుప్పం బ్రాంచ్ కాల్వలు ద్వారా కృష్ణా జలాలు ప్రహహించనున్నాయి. జిల్లా పరిధిలో తొలి విడతగా తంబళ్ళపల్లి, మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజక వర్గాల ప్రజలకు మేలు జరగనుంది. ముఖ్యంగా మదనపల్లి డివిజన్‌లో 1.80లక్షల ఎకరాలకు సాగు నీరు, సుమారు పది లక్షల మందికి తాగు నీటి సదుపాయం కలగనుంది. ఇందు కోసం 28 పంపింగ్ స్టేషన్లను నిర్మించారు. తొలుత పీటీఎం చెరువును ఈ నీటితో నింపి తరువాత వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మదనపల్లి డివిజన్‌లో పలు చెరువులను కృష్ణాజలాలతో నింపనున్నారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గమైన కుప్పానికి హంద్రీ -నీవా జలాలను తీసుకెళ్లడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు జలకళ సంతరించుకోనున్నా రానున్న రోజుల్లో అడివిపల్లి రిజర్వాయర్ ద్వారా చిత్తూరుకు ఈ నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పంపింగ్ స్టేషన్లు, పైప్‌లైన్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఈ పనులు పూర్తి అయితే జిల్లా కేంద్రంలోని కల్వకుంటకు ఈ నీరు రానున్నది. నిత్యం కరవుతో అల్లాడుతున్న పడమటి మండలాలకు హంద్రీ నీవా ప్రాజెక్టు వల్ల సాగు తాగు నీటి కష్టాలు తీరునున్నాయి.