ఆంధ్రప్రదేశ్‌

మోదీ నాయకత్వంలో దేశం తిరోగమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 21: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం తిరోగమనంలో పయనిస్తోంది.. ఆయనో నెగటివ్ లీడర్‌గా మారారు.. అభివృద్ధి స్తంభించింది.. పేదల సంక్షేమం పడకేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. సోమవారం ఉండవల్లి నుంచి పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కోల్‌కతా బ్రిగేడ్ గ్రౌండ్స్‌లో చారిత్రాత్మక సభ జరిగిందని పది లక్షల మందికి పైగా తరలి వచ్చారని గుర్తుచేశారు. అదే తరహాలో అమరావతిలో పెద్దఎత్తున సభ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. దేశ ప్రజల్లో కోల్‌కతా సభ ఓ భరోసా ఇచ్చిందన్నారు. నిరంకుశ పాలన అంతానికి అది నాంది పలికిందని అభివర్ణించారు. అమరావతిలో నిర్వహించే సభకు 22 పార్టీల నేతలు తరలి రానున్నట్లు చెప్పారు. ఏపీకి కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే చాలా తక్కువగా నిధులు మంజూరు చేశారని ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ రోడ్లకంటే 7 రెట్లు, మహారాష్ట్ర కంటే 4 రెట్లు తక్కువ ఇచ్చారని ఏపీ రహదార్లకు ఇచ్చింది కేవలం రూ 5399 కోట్లు మాత్రమే అని ఆక్షేపించారు. వారానికి ఒక కేంద్రమంత్రి ఏపీకి వస్తారా.. ఏం మేళ్లు చేశారని వస్తున్నారు.. పైగా బెదిరింపులకు దిగుతున్నారు.. రాష్టప్రతి పాలన పెడతామని హెచ్చరిస్తున్నారు.. ఇలాంటి బెదరింపులకు భయపడేదిలేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష వైసీపీ, టీఆర్‌ఎస్ లాలూచీపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పార్టీ నేతలకు నిర్దేశించారు. గతంలో వైఎస్‌పై ప్రచురించిన రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకంలో కేసీఆర్‌ది రెండో సంతకంగా ఉందని ఇప్పుడు అదే వైఎస్‌ను పొగడ్తలతో ముంచెత్తటం రాజకీయ ప్రయోజనాల కోసమే అన్నారు. జగన్‌తో కేటీఆర్ భేటీ అయి వారం కాలేదు.. ఆ వెంటనే కేసీఆర్‌కు లేఖ రాశారన్నారు. అసెంబ్లీలో కేసీఆర్ జగన్‌ను పొగడటం మోదీ డైరెక్షన్‌లో భాగమే అని విమర్శించారు. బీసీలలో అపోహలు తేవాలని టీఆర్‌ఎస్, వైసీపీ చేస్తున్న కుట్రలను ఎండగట్టాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. బీసీలే సంఘటితంగా ఈ కుట్రలను ప్రతిఘటించాలని కోరారు. చిత్తూరుకు కృష్ణాజలాలు తరలించటం చారిత్రాత్మకమన్నారు. కృష్ణాజలాలకు సీమ ప్రజలు హారతులు పడుతున్నారన్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నామని వివరించారు. గ్రామాలకు నీరందించటం కంటే పండుగ ఏముంటుందని వ్యాఖ్యానించారు. పండుగ వాతావరణంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సాధికారతే పార్టీ సాధికారత కావాలన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు సాధిస్తున్నామని పెన్షన్ రూ 2వేలకు పెంచటంతో ప్రజల్లో పెద్దఎత్తున సంతృప్తి స్థాయి పెరిగిందన్నారు. దీంతో ప్రతిపక్షం పూర్తిగా డీలాపడిందని ఎద్దేవా చేశారు. వయాడక్ట్ ఓ తారకమంత్రమన్నారు. ప్రతి వ్యక్తి, గ్రామానికి విజన్ ఉండాలి.. మెరుగైన ఫలితాలకే ఇన్నోవేషన్ ఇందులో అంతా బాధ్యులు కావాలన్నారు. డిజిటలైజేషన్, ఉబరైజేషన్ అందిపుచ్చుకోవాలన్నారు. కన్వర్జెన్స్, ట్రాన్స్‌ఫర్మేషన్ అందుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో అపూర్వ ఆదరణ ఉందన్నారు. ప్రతిష్టాత్మక విజయమే అందరి లక్ష్యం కావాలని ఉద్బోధించారు.