ఆంధ్రప్రదేశ్‌

‘ఎర్ర’ దొంగల ఆటకట్టిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: ఎర్రచందనం స్మగ్లర్లపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కఠినతరమైన చట్టాలు తీసుకువస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఎర్రచందనంపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆ తరువాత జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్మగ్లింగ్‌కు పాల్పడిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చామని, అది వెంటనే అమల్లోకి రానుందని చెప్పారు. శేషాచలం అడవుల్లోకి అంతర్జాతీయ స్మగ్లర్లు ప్రవేశించారని, ఇక్కడి నుంచి ఓ కారిడార్‌ను ఏర్పాటు చేసుకుని, ఎర్రచందనాన్ని చైనాకు తరలించుకుపోతున్నారని ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ఇంటర్నేషనల్ యాక్ట్‌లను కూడా తీసుకువస్తున్నామని ఆయన తెలియచేశారు. శేషాచలం అడవుల్లో 15 లక్షల ఎకరాలను నోటిఫై చేశామని సిఎం చంద్రబాబు తెలియచేశారు. ఇందులో ఇతరుల ప్రవేశానికి అవకాశం లేదని, ఇక్కడ ఒక ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తుందని ఆయన వివరించారు. అటవీశాఖ అధికారులు, పోలీసులతోపాటు, అదనపు సాయుధ బలగాలు ఇక్కడ నిరంతరం పహారా కాస్తుంటాయని ఆయన తెలియచేశారు. స్మగ్లర్లకు స్థానికులు సహకరిస్తున్నారని, వారు ఆ పని మానుకోవాలని సిఎం విజ్ఞప్తి చేశారు. ఎర్రచందనాన్ని చట్టపరంగా విక్రయించడానికి ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియచేశారు. ఎర్రచందనాన్ని విక్రయించేందుకు గ్లోబల్ టెండర్లు పిలుస్తామని ఆయన చెప్పారు. ఎర్రచందనం విక్రయ బాధ్యత ఈ కార్పొరేషన్‌కే అప్పగిస్తామని చంద్రబాబు చెప్పారు. వచ్చేనెలాఖరులో ఎర్రచందనాన్ని వేలం వేయనున్నట్టు సిఎం ప్రకటించారు. ఇప్పటి వరకూ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేశారు. ఇకపై ఎవరైనా స్మగ్లింగ్ చేయాలనుకుంటే, ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి. లేకుంటే ఆ వ్యక్తులకు అదే ఆఖరి రోజవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. ఈ స్మగ్లింగ్‌లో ఇతర దేశాల వారు ఉన్నట్టు తేలితే, ఎటువంటి విచారణ లేకుండా విదేశాల్లో ఉన్న వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చంద్రబాబు చెప్పారు. ఎర్రచందనాన్ని విదేశాల్లో విక్రయించేందుకు సపరేట్ క్లియరెన్స్ హౌస్ ఏర్పాటు చేస్తున్నామని అన్నరు. విదేశాల్లో ఎర్రచందనాన్ని విక్రయించేందుకు అవసరమైతే ఏజెంట్లను నియమిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుబడిన గంగిరెడ్డి ఆస్తుల జప్తు విషయంలో ఎందుతు తాత్సారం వహిస్తున్నారని విలేఖరులు ప్రశ్నించగా, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరేంటో త్వరలోనే చూస్తారని సిఎం అన్నారు.

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు