ఆంధ్రప్రదేశ్‌

భవిష్యత్ అవసరాల కోసం మాస్టర్ ప్లాన్ సమీక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 20: పెద్ద నగరాల మాస్టర్ ప్లాన్‌ను సమీక్షించాల్సిన అవసరం ఉందని పబ్లిక్ అంకౌంట్స్ కమిటీ చైర్మన్ బి రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విశాఖలో మూడు రోజుల పాటు వివిధ అంశాలపై సమీక్షించిన కమిటీ బుధవారం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ అవరాలకు అనుగుణంగా నగరాల మాస్టర్ ప్లాన్‌కు సవరణలు చేయాల్సి ఉందని, ఈ అంశాన్ని తాము ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. రాష్ట్రంలో పట్టణీకరణ ప్రక్రియ అత్యంత వేగవంతగా జరుగుతోందని, గ్రామీణ ప్రజానీకం పెద్ద ఎత్తున పట్టణాలకు వలస వస్తున్న నేపథ్యంలో పట్టణాల్లో వౌలిక సదుపాయాల కల్పన జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అంతకు ముందు కమిటీ ప్రతినిధులు విశాఖ నగరంలోని సీతమ్మధారలో లాన్‌సమ్ నిర్మిస్తున్న భారీ బహుళ అంతస్తుల భవనాన్ని సందర్శించారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ భవనానికి అనుమతులు మంజూరు చేసిన అంశాన్ని కమిటీ ఆరా తీసింది. కమిటీ సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు (బిజెపి) భవన నిర్మాణంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రద్దీ ప్రాంతంలో 34 అంతస్తులతో వాణిజ్య, గృహ నివాస బహుళ అంతస్తుల భవనం నిర్మాణం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందన్నారు. తాను ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు. దీనిపై కమిటీ చైర్మన్ రాజేంద్రనాధ్ రెడ్డి జివిఎంసి పట్టణ ప్రణాళికాధికారి వెంకటరత్నం వివరణ కోరుతూ పిఎసికి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. విల్లాల నిర్మాణం అసంబద్ధంగా ఉందని న్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పర్యటనలో సభ్యులు బి చెంగల్రాయుడు, పిల్లి సుభాష్‌చంద్ర బోస్, బికె పార్థసారధి, డి రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.

విశాఖలోని 34 అంతస్థుల భవన నిర్మాణం అనుమతులపై
వివరాలు తెలుసుకుంటున్న పిఎసి చైర్మన్ రాజేంద్రనాథ్, కమిటీ సభ్యులు