ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ వాణిజ్య సంస్థ చట్టాలను భారత్ అర్థం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 6: ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన చట్టాలను సునిశితంగా అర్ధం చేసుకుని, అవగాహన పెంచుకోవడంలో భారతదేశం ఇప్పటికీ వెనుకబడి ఉందని సుప్రీంకోర్టు న్యాయవాది సునీల్ బౌడేకర్ అభిప్రాయపడ్డారు. గీతం డీమ్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లాలో ‘ భారతీయ వాణిజ్య విధానం - డబ్ల్యుటీఓ నిబంధనలు’ అనే అంశంపై బుధవారం జరిగిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. శీతల పానీయాల సంస్థలు, స్టీల్ ఉత్పాదనల దిగుమతులపై అంతర్జాతీయ న్యాయస్థానాల్లో భారతదేశానికి చుక్కెదురుకాడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన చట్టాలపై ప్రభుత్వానికి, న్యాయనిపుణులకు పూర్తి అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. డబ్ల్యుటీఓ చట్టాలను చైనా అర్ధం చేసుకున్నంతగా మరేదేశం అర్ధం చేసుకోలేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారతదేశం నాణ్యతతో కూడిన ఉత్పతుల ద్వారా మాత్రమే పోటీపడాలన్నారు. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఆంక్షలు పెట్టాలను కోవడాన్ని డబ్ల్యుటీవో చట్టాలు సమర్ధించవన్నారు. భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు తగ్గడానికి మితిమీరిన సబ్సిడీలు కారణమన్నారు. వ్యవసాయ రంగానికి సమతుల్యతతో కూడిన సహకారం ఉండాలన్నారు. సబ్సిడీలతో అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించే ఉత్పత్తులను ప్రపంచ వాణిజ్య సంస్థ ఆమోదించడం లేదన్నారు. న్యాయ విద్యనభ్యసించే విద్యార్థులు డబ్ల్యుటీవో చట్టాలను లోతుగా అథ్యయనం చేసుకోవాలని సూచించారు. గీతం డీమ్డ్ యూనివర్శిటీ ఇన్‌ఛార్జి వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన చట్టాలను ఆర్థిక ప్రగతిని అవగాహన చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ లా డైరెక్టర్ ప్రొఫెసర్ అనితారావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. సుప్రీంకోర్టు న్యాయవాది సునీల్‌ను సత్కరిస్తున్న గీతం ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ శివరామకృష్ణ