ఆంధ్రప్రదేశ్‌

ఐదు బిల్లులకు సభలో ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (పాయకాపురం), ఫిబ్రవరి 6: శాసనసభలో బుధవారం ఐదు బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. 2019 ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, 2019 ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ బిల్లును మంత్రి గంటా శ్రీనివాసరావు, 2019 ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళికల బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి కె అచ్చెనాయుడు, 2019 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక బలహీన వర్గాల పౌరుల బిల్లును, కాపులు కానటువంటి ఆర్థిక బలహీన వర్గాల బిల్లును మంత్రి అచ్చెనాయుడు ప్రవేశపెట్టగా, సభ ఆమోదించింది.