ఆంధ్రప్రదేశ్‌

తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఫిబ్రవరి 6: తెలుగుదేశం పార్టీ అనుబంధ తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రాంగణంలో బుధవారం సాయంత్రం జరిగిన సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకట్రావ్ హాజరై దేవినేని అవినాష్ చేత తెలుగుయువత అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకానికి తగ్గట్టుగా కష్టపడి పనిచేసి పార్టీ పటిష్టతకు 13 జిల్లాలో తిరిగి కృషి చేస్తానని చెప్పా రు. తన తండ్రి దేవినేని నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా పార్టీ అభివృద్ధికి పాటుబడతానన్నారు. తండ్రిని కోల్పోయిన తనను చంద్రబాబు, లోకేష్ వెన్నుతట్టి ప్రోత్సహించారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, జలీల్ ఖాన్, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బచ్చుల ఆర్జునుడు, మేయర్ కోనే రు శ్రీ్ధర్, 13 జిల్లాల తెలుగుయువత అధ్యక్షులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

చిత్రం.. అవినాష్‌ను అభినందిస్తున్న తెలుగు మహిళా నేతలు